-
-
నవ్య కవితారూపం నానీ - వివేచన
Navya Kavitha Roopam Nani Vivechana
Author: Dr. Chintakindi Srinivasa Rao
Publisher: Visakha Samskruti Prachuranalu
Pages: 208Language: Telugu
విశాఖ సముద్రాన్ని తన కలంలో సిరాగా మార్చుకుని నిరంతర చైతన్య భావధారలతో పాఠకులను పలుకరించే చింతక్రింది శ్రీనివాసరావు ఇప్పుడీ నానీల పరిశోధన సిద్ధాంత గ్రంథంలో డాక్టర్ కావడం ఆశ్చర్యం! ఎందుకంటే, కాలంతో పరుగులు పెడుతూ ఎన్నో ఒత్తిళ్లతో సతమతమయ్యే పాత్రికేయ వృత్తికారుడికి ఇంత అకడమిక్ డిసిప్లిన్ ఉండటం అభినందించదగ్గ విషయమే కదా! నిజంగానే చింతకింది గురించి చింతన చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
గత ఇరవై అయిదేళ్లుగా పాత్రికేయ జీవనంలో తను ముట్టుకోని వార్త, పట్టుకోని ఫీచర్ లేదన్నట్లుగా అన్ని రంగాల కథనాలను అలవోకగా రాస్తున్నాడు. రాసిన ప్రతీ వార్తలో నిజాయితీ, స్పష్టత, సరళత, బాధ్యతలతో జర్నలిస్టిక్ రైటింగ్‌కి ఉండే ప్రామాణికతాస్థాయిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా సాక్షి దినపత్రిక ఫ్యామిలీ పేజిల్లో రాస్తున్న మహిళాస్ఫూర్తి కథనాలు చింతకింది శ్రీనివాసరావులోని వైవిధ్యమైన ఆలోచనలకు, విశిష్ట హృదయానికి దర్పణాలు. వృత్తిగత ధర్మానికి మానవతావిలువలు మేళవించిన అల్లిన ఆణిముత్యాల మాల అది. నేటి పురుషలోకం నిత్యం ధరించవలసిన జపమాల.
ఉత్తరాంధ్ర అనగానే ఒకవైపు భూగోళమంత బరువైన రావిశాస్త్రి, ఆకాశమంత విస్తృతిగల పతంజలి గుర్తుకువస్తారు. వారిద్దరూ లేని లోటులోంచి నాకు ఈ శ్రీనివాసరావు కనిపిస్తున్నాడు. ఏదో తెలియని ఆశను, భావావేశాన్ని వాగ్దానం చేస్తున్నట్లుగా అనిపిస్తున్నాడు. ఈ మహారచయితల అడుగుజాడల్ని తడిమిన మట్టి చేతులతో చింతికింది ఉత్తరాంధ్ర మాండలిక పరిమళాల్ని వెదజల్లుతున్నాడు. నుడికారంపై మమకారం పెంచుకుని భాషకు కొత్త సొగసులు అద్దే అక్షరక్రియలో ఉన్నాడు. కథానిలయానికి దగ్గరగా ఉన్న ఈ కథకుడు రేపటి కథకు చిరునామాగా మారుతాడేమో! అగ్రవర్ణాన్ని, అగ్రహారాన్ని పక్కనబెట్టి మట్టిమనుషులతో మమేకమయ్యే ప్రజాస్వామ్యవాది ఇతడు. ఎదలను కదిలించే సృజనశీలి నుండి వెలువడిన ఈ "నవ్య కవితారూపం నానీ - వివేచన" పరిశోధనా గ్రంథం నానీల కవితా వికాస తాత్వికతలను సమగ్రంగా వివరిస్తూ రేపటి నానీల కవులకు, పరిశోధకులకు కరదీపికగా నిలబడుతుంది.
- డా. ఎస్. రఘు
కవి, విమర్శకుడు

- ₹118.8
- ₹118.8
- ₹172.8
- ₹129.6
- ₹135
- ₹135
- ₹36
- ₹135
- ₹135
- ₹36
- ₹36
- ₹36