• Navya Katha Silpi B S Ramulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 172.8
    192
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవ్య కథాశిల్పి బి.ఎస్‌. రాములు

    Navya Katha Silpi B S Ramulu

    Author:

    Pages: 224
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బి. ఎస్. రాములు రాసిన 47 కథలపై సుప్రసిద్ధ కథకులు, కవి, సీనియర్‌ సాహిత్య విశ్లేషకులు, విహారి చేసిన పరిచయం, పరామర్శ, విశ్లేషణే ఈ పుస్తకం.

చేయి తిరిగిన కథకుడు, విస్తృతమైన అధ్యయనం, అనుభవం కలవాడు, కథా సాహిత్య విశ్లేషణలో ఎంతో కృషి చేసి ఎన్నో పుస్తకాలు రాసిన అనుభవంతో విహారి రాసిన ఈ గ్రంథం పరిశోధక విద్యార్ధులకు మించి మరెన్నో విషయాలను విశ్లేషించి అలంకార శాస్త్రాల కోణంలో ఈ గ్రంథాన్ని ఒక మౌలిక గ్రంథంగా తీర్చిదిద్దారు.
ఆయా రచయితల, రచనల ప్రభావం సమాజంపై పడే క్రమంలో మరింత లోతైన అధ్యయనం సాగుతుంది. సహృదయ విమర్శకులు వాటిలోని బహు ముఖీనతను వెలికితీసారు. గొప్ప కథకునికి సహృదయ విమర్శకుడు తోడైనపుడు ఇలాంటి గొప్ప గ్రంథాలు వెలువడుతాయి. 'నవ్య కథాశిల్పి బి.ఎస్‌. రాములు కథా విశ్లేషణ' అనే శీర్షికే వీరి నూతన ప్రతిపాదనలను వెల్లిస్తుంది.

ఈ గ్రంథంలో బి.ఎస్‌. రాములు కథలను అనేక కోణాల్లో ఫోటోలు తీశారు. విశ్లేషించారు. ముఖ్యంగా బి.ఎస్‌. కథానికల్లోని వస్తు విస్తృతీ, వైవిధ్యం, శిల్ప సళిలిందర్యం, శిల్ప రీతులు, సన్నివేశ కల్పన, పాత్రచిత్రణ - సంభాషణా ఔచిత్యం, సంఘర్షణ - వర్ణనలు, కథా ఆరంభం - ముగింపులు, కొన్ని ప్రత్యేక పాత్రలు, భాషా, శైలీ, పలుకుబడి, చారిత్రక, సామాజిక పరిణామ చిత్రణ, స్థలకాలాల నిర్దిష్టత, స్త్రీల పాత్ర చిత్రణ - ఇలా బి.ఎస్‌. కథలను పరిశీలించి నూతన కోణాలను వెలికితెచ్చారు. ఒక క్రమ పద్ధతిలో పాఠకులకు అందించారు.

ఈ విశ్లేషణ చదువుతూ ముందుకు పోతుంటే కథల్లోని పాత్రలూ, సన్నివేశాలు, సంఘర్షణ, వైవిధ్యాలు మనను చుట్టుముడుతాయి. కథను చదివినంత అనుభూతి సాంద్రతను కలిగిస్తాయి. 80 ఏళ్ల కిందటినుంచీ, ఇప్పటిదాకా ఆటు పోట్లకు గురవుతూ విస్తృతిని సంతరించుకున్న తెలంగాణా గ్రామీణ పరిణామాలు, మధ్యతరగతి జీవితం, ఉద్యమాలు, సమాజంలోని సంఘర్షణ, మారుతున్న మానవ సంబంధాలు, సంస్కృతి పరిణామాలు, వివిధ సామాజిక వర్గాల జీవితాలు, మనచుట్టూ తిరుగుతూ మనను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మన బాల్యం, మన పల్లెలు, మనపట్టణాలు, మన ప్రాంతం నుండి విశాల విశ్వందాకా విస్తరించిన క్రమం కళ్లముందు కనపుతుంది.

సహృదయుడైన విమర్శకుడు దొరకం కథకుని అదృష్టం. విహారి వంటి గొప్ప విమర్శకుడు మూడు కథా సంపుటాల్లోగల 'తెలంగాణా పల్లెనుండి విశాల విశ్వందాకా' విస్తృతిని, పరి శీలనను, అధ్యయనాన్ని, పాత్ర చిత్రణను, సామాజిక ప్రయోజనాన్ని, కథలకు, కథకులకు, పరిశోధక విద్యార్ధులకు ఒక లోతైన చూపును, దిశను తెలుపుతూ రాసిన ఈ పుస్తకం కథకులకు, కథాభిమానులకు సాహిత్య పరిశీలకులకు ఒక కరదీపికగా భాసిస్తుంది అనడంలో సందేహంలేదు.

- నిజాం వెంకటేశం

Preview download free pdf of this Telugu book is available at Navya Katha Silpi B S Ramulu