-
-
నవ్య జ్యోతిషం
Navya Jyothisham
Author: Tippavajjhula Kumar
Publisher: Ramapriya Publications
Pages: 232Language: Telugu
ప్రముఖుల జాతకాలు విశ్లేషిస్తూ ఒక కాలమ్ రాయాల్సిందిగా నవ్య వారపత్రిక సంపాదకులు శ్రీ ఎ. ఎన్. జగన్నాథశర్మ గారు ప్రోత్సాహించారు. దాంతో నవ్య వారపత్రికలో రెండేళ్ళ పాటు 'నవ్య జ్యోతిషం' శీర్షికన వందకు పైగా ప్రముఖుల జాతకాలను విశ్లేషించే అవకాశం లభించింది. "సాయన పద్ధతిలో మీరు చేస్తున్న విశ్లేషణ ఆసక్తికరంగా ఉంటున్నది... సాయన సిద్ధాంతం గురించి వివరించే పుస్తకాలు మార్కెట్లో దొరుకుతాయా అని పాఠకులు ప్రశ్నించేవారు. సాయన జ్యోతిషశాస్త్ర పితామహుడు ఆలెన్ లియో ఇంగ్లీషులో రాసిన గ్రంథాలున్నాయి కానీ తెలుగులో సాయన జ్యోతిషం మీద పుస్తకాలు లేవు.
తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థుల కోసం శ్రీ వి.వి.రావుగారు రాసిన వ్యాసాల స్ఫూర్తితో, సాయన జ్యోతిష అభిమానుల ఆకాంక్షలు, జ్యోతిష విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని సాయన సూత్రాలను సమగ్రంగా, సరళంగా అందించాలని సంకల్పించాను. దాని ఫలితమే ఈ 'నవ్య జ్యోతిషం' పుస్తకం. సాయన సూత్రాలతో పాటు 30 మంది ప్రముఖుల జాతకాల విశ్లేషణను కూడా ఈ పుస్తకంలో చేర్చాను. సాయన జాతక సూత్రాల ఆధారంగా ఫలితాలు చెప్పేందుకు జ్యోతిష విద్యార్థులకు ఈ విశ్లేషణలు ఉపయోగపడతాయని నా భావన.
- తిప్పావఝుల కుమార్
