-
-
నవ్వు, నవ్వించు...
Navvu Navvinchu
Author: Multiple Authors
Publisher: Manchi Pustakam
Pages: 126Language: Telugu
Description
నవ్వు, నవ్వించు...
జోక్స్, కొంటె ప్రశ్నలు - చిలిపి జవాబులు, పొడుపు కథలు
చాలామంది పిల్లలు రాసి పంపించిన ఈ జోకుల్ని కొత్తపల్లి పత్రిక వారు ఏ నెలకానెల ప్రచురిస్తూ వచ్చారు. వాటన్నిటి సంకలనం, ఈ పుస్తకం.
* * *
రాజు: నేను ఒక సింహం కాలు, ఏనుగు తొండం, గాడిద ముక్కు విరగొట్టాను.
ఆనంద్: వావ్! అప్పుడు ఏమైంది?
రాజు: ఏమవుతుంది? షాపులో బొమ్మలు విరగ్గొట్టినందుకు షాపతను బాగా కొట్టాడు. ఇప్పటివరకు ఆ నొప్పి తగ్గలేదు...!
* * *
డాక్టరుగారి అబ్బాయి రాము: ఒరేయ్ రాజు, మా నాన్న అమెరికా నుండి నిజాలు చెప్పించే మాత్రలు తెప్పించారురా.
రాజు: ఏదిరా, నాకొకటివ్వు?
రాము: ఇదిగో తిను...
రాజు: ఒరేయ్, ఇది హజ్మోలారా...
రాము: చూశావా, నువ్వు అప్పుడే నిజం చెప్పేశావు.
* * *
వార్తలు వినే అలవాటున్న టీచరు, క్లాసు ముగించే ముందు ఏమంటుంది?
ముఖ్యాంశాలు మరోసారి!
* * *
ఎండమావి అంటే ఏంటి?
ఎండలో ఉన్న మామిడి చెట్టు!
* * *
ఇంద్రధనస్సులో చివరిది ఏది?
''స్సు''!
Preview download free pdf of this Telugu book is available at Navvu Navvinchu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE