-
-
నవ్వు దేవుడొచ్చాడోచ్
Navvu Devudochchadoch
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Pages: 41Language: Telugu
మనం నవ్వడం మర్చిపోతున్నాం...మనకు మనమే సృష్టించుకున్న కృతిమ ఒత్తిడిలో మనసారా నవ్వుకోలేకపోతున్నాం...కథాప్రపంచంలో పాత్రలతో మమేకమవుతూ పెదవులపై చిరునవ్వుతో వుండే మనం ముడుచుకుపోతున్నాం.
ఒకసారి నవ్వుల ప్రపంచంలోకి అడుగుపెట్టండి.
* నవ్వు దేవుడి కోసం తపస్సు చేసాడు.తనను దేవుడిని చేయమని అడిగాడు.దేవుడు నవ్వుని "నవ్వు దేవుడిని" చేసాడు.అప్పటి నుంచి ప్రపంచంలో వింత మార్పులు..?నవ్వు దేవుడికి గుడులెక్కడ?నవ్వు దేవుడెక్కడ? తెలుసుకోవాలంటే "నవ్వు దేవుడొచ్చాడోచ్" కథ చదవాలి
(స్వాతి సపరివార పత్రిక కామెడీ కథల పోటీలో 10,000 / బహుమతి పొందిన కథ)
*మందహాసం
అస్సాంలోని ఘోస్ ముడి ప్రాంతంలో నివసించే ఒక ఆదివాసీ తెగవారు తమ శత్రువుల మీద పగసాధించడానికి ఓ ప్రయోగం చేశారు. అక్కడ అడవుల్లో దొరికే 'స్కెది' అనే వనమూలికలు పొడిచేసి మధ్యంలో కలిపి యిస్తే అది తాగిన వ్యక్తులు నవ్వలేక చచ్చేవారుట.
* నవ్వు కనబడుటలేదు
ఇరవై నాలుగు సంవత్సరాలుగా నా పెదవులకు అంటిపెట్టుకొనివున్న నా నవ్వు కనబడుటలేదు. నా నవ్వును తెచ్చి ఇచ్చినవారికి, లేదా ఆచూకీ తెలిపినవారికి తగిన పారితోషికం ఇవ్వబడును. ప్రియమైన నవ్వూ ..నువ్వెక్కడున్నా వెంటనే తిరిగిరా...నీ కోసం నేను బెంగపెట్టుకున్నాను. ఆ నవ్వు ఆచూకీ తెలిసినవారు ఈ క్రింది చిరునామాలో సంప్రదించగలరు.
* లాఫింగ్ ట్రీ
వెల్కమ్ టు నవ్వు ఎగ్జిబిషన్...దాదాపు ముప్పైఏళ్ళ క్రిందట 'నవ్వు' అనేది మన బాడీలో...ముఖ్యంగా పెదవుల మీద ఉండేది'' అతను చెప్పడం ఆపి...ఎలా నవ్వాలో తెలియక, మొహం మాడ్చుకొని జనం వైపు చూశాడు.
''ఈజిట్ ట్రూ...నిజమా...నవ్వేలా ఉంటుందబ్బా...'' జనంలో క్యూరియాసిటీ...
* భద్రం బీకేర్ ఫుల్
సిగ్గేశ్వర్రావ్ పగలబడి నవ్వి ''పిచ్చిబావా...ఇప్పుడు హైదరాబాద్ జనాభా ఎంతనుకున్నావు...జస్ట్ ఎనిమిది వేలు...ఆంధ్రప్రదేశ్ జనాభా లక్షా నలభైవేలు...''
కళ్ళు తిరిగిన సెన్సేషన్ కలిగింది ముక్కంటికి.
*యంత్ర సుందరి
''ఇదంతా కలా ? నిజమా? చిన్న టెస్టింగ్ చేద్దామని అయినా రోబోతో ఆరునెలలు కాపురం చూసారుగా...విశేషమేమీ లేదా?'' అంది ఆటపట్టిస్తూ..
* అపాయింట్మెంట్ ప్లీజ్
కూర్మాచలం దృష్టి అంత జ్ఞాన ప్రసూన మీదే ఉంది.బావురుకప్పుల నోరు తెరిచిన పేషెంట్ నోట్లో అతనికి పార్కు కనిపిస్తుంది.ఆ పార్కులో కూచొని తనకోసం ఎదురుచూస్తున్న జ్ఞాన ప్రసూన కనిపిస్తుంది.
మీ పెదవులపై నవ్వుల పువ్వులు పూయించే కథల పరిమళాలు
ప్రముఖరచయిత విజయార్కె స్వాతి ,ఆంధ్రప్రభ,మయూరి పత్రికల్లో రాసిన కథలు....
నవ్వు దేవుడొచ్చాడోచ్...
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ
నవ్వును మర్చిపోయి కృత్రిమమైన సంతోషం కోసం పబ్స్ కు వెళ్లి,ప్రమాదకరమైన పబ్జీ గేమ్స్ ఆడి నిరర్థకమైన సంతోషాన్ని వెతుక్కునేవారు ఈ పుస్తకం చదివి మనసారా నవ్వుకోవచ్చు.ఆహ్లాదాన్నే కాదు ఆలోచనను కలిగించే బెస్ట్ కామెడీ స్టోరీస్.ముఖ్యంగా స్వాతిలో బహుమతి పొందిన రెండు కథలు...నవ్వు కనబడుట లేదు,నవ్వు దేవుడొచ్చాడోచ్ ...
" నవ్వు దేవుడి కోసం తపస్సు చేసాడు.తనను దేవుడిని చేయమని అడిగాడు.దేవుడు నవ్వుని "నవ్వు దేవుడిని" చేసాడు.అప్పటి నుంచి ప్రపంచంలో వింత మార్పులు..?నవ్వు దేవుడికి గుడులెక్కడ?నవ్వు దేవుడెక్కడ? "
ఈ ఆలోచనే ఫెంటాస్టిక్ గా వుంది.
మనకు ఎందరో దేవుళ్లున్నారు..మరి నవ్వు దేవుడు కూడా ఉంటే..ఈ ఆలోచన నవ్వు తెప్పిస్తుంది..అందుకే కాబోలు స్వాతిలో 10 ,000 / పదివేల రూపాయల బహుమతి గెలుచుకుంది. విజయార్కె గారి కథలు ముఖ్యంగా కామెడీ కథలు విభిన్నంగా ఉంటాయి.నవ్వు కనబడుటలేదు కథలో నవ్వు కనబడుట లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు..భార్య బదులు యంత్రమైతే చెప్పినట్టు ఉంటుందని జపాన్ నుంచి తెప్పించుకున్న యంత్రసుందరి కథ..ఇళ్న్తి కథలు దూరప్రాంతంలో పని ఒత్తిడిలో వుంది నవ్వడం మర్చిపోయిన మాలాంటివారికి నవ్వును ఎనర్జీగా ఇస్తుంది.అరవై రూపాయలతో వందేళ్ల జీవితంలో నవ్వులు కురిపించే పుస్తకం " నవ్వు దేవుడొచ్చాడోచ్ "
నవ్వుదేవుడు కూడా ఉంటాడన్న ఆలోచన నవ్వు తెప్పిస్తుంది.ఆలోచించమని చెబుతుంది,నవ్వును మర్చిపోయినవారికి నవ్వుని పరిచయం చేస్తుంది.
అందుకే కాబోలు స్వాతిలో ఈ కథ 10 .000 / ,బహుమతి గెల్చుకుంది,
నవ్వుతూ చదువుతూ చదివాకా కూడా నవ్వుతూ ఉండేలా చేసే కథ నవ్వు దేవుడొచ్చాడోచ్ ..
మళ్ళీ మళ్ళీ చదవాలని చదివి నవ్వుకోవాలని అనిపించే కథలు ..
*మందహాసం
అస్సాంలోని ఘోస్ ముడి ప్రాంతంలో నివసించే ఒక ఆదివాసీ తెగవారు తమ శత్రువుల మీద పగసాధించడానికి ఓ ప్రయోగం చేశారు. అక్కడ అడవుల్లో దొరికే 'స్కెది' అనే వనమూలికలు పొడిచేసి మధ్యంలో కలిపి యిస్తే అది తాగిన వ్యక్తులు నవ్వలేక చచ్చేవారుట.
* నవ్వు కనబడుటలేదు
ఇరవై నాలుగు సంవత్సరాలుగా నా పెదవులకు అంటిపెట్టుకొనివున్న నా నవ్వు కనబడుటలేదు. నా నవ్వును తెచ్చి ఇచ్చినవారికి, లేదా ఆచూకీ తెలిపినవారికి తగిన పారితోషికం ఇవ్వబడును. ప్రియమైన నవ్వూ ..నువ్వెక్కడున్నా వెంటనే తిరిగిరా...నీ కోసం నేను బెంగపెట్టుకున్నాను. ఆ నవ్వు ఆచూకీ తెలిసినవారు ఈ క్రింది చిరునామాలో సంప్రదించగలరు.
* లాఫింగ్ ట్రీ
వెల్కమ్ టు నవ్వు ఎగ్జిబిషన్...దాదాపు ముప్పైఏళ్ళ క్రిందట 'నవ్వు' అనేది మన బాడీలో...ముఖ్యంగా పెదవుల మీద ఉండేది'' అతను చెప్పడం ఆపి...ఎలా నవ్వాలో తెలియక, మొహం మాడ్చుకొని జనం వైపు చూశాడు.
''ఈజిట్ ట్రూ...నిజమా...నవ్వేలా ఉంటుందబ్బా...'' జనంలో క్యూరియాసిటీ...
నవ్వడంలో గొప్ప రిలాక్సేషన్ ఉంటుందని నవ్వించి నవ్విస్తూ చెప్పిన కథలు .
మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే కథలు.ప్రతీకథ ఒక హాస్యగుళిక.విభిన్నమైన వైవిధ్యమైన హాస్యకథలు.ఒత్తిడి నుంచి మనల్ని దూరం చేసే కథలు.
అస్సాంలోని ఘోస్ ముడి ప్రాంతంలో నివసించే ఒక ఆదివాసీ తెగవారు తమ శత్రువుల మీద పగసాధించడానికి ఓ ప్రయోగం చేశారు. అక్కడ అడవుల్లో దొరికే 'స్కెది' అనే వనమూలికలు పొడిచేసి మధ్యంలో కలిపి యిస్తే అది తాగిన వ్యక్తులు నవ్వలేక చచ్చేవారుట.మందహాసం కథలో ఈ విషయం చదివి ఆశ్చర్యపోయాను.నవ్విస్తూనే ఎన్నో నిజాలను చెప్పిన కథ.నవ్వు గొప్పతనాన్ని తెలియజెప్పిన కథ.
నవ్వు దేవుడి కోసం తపస్సు చేసాడు.తనను దేవుడిని చేయమని అడిగాడు.దేవుడు నవ్వుని "నవ్వు దేవుడిని" చేసాడు.అప్పటి నుంచి ప్రపంచంలో వింత మార్పులు..?నవ్వు దేవుడికి గుడులెక్కడ?నవ్వు దేవుడెక్కడ? తెలుసుకోవాలంటే "నవ్వు దేవుడొచ్చాడోచ్" కథ చదవాలి
ఇరవై నాలుగు సంవత్సరాలుగా నా పెదవులకు అంటిపెట్టుకొనివున్న నా నవ్వు కనబడుటలేదు. నా నవ్వును తెచ్చి ఇచ్చినవారికి, లేదా ఆచూకీ తెలిపినవారికి తగిన పారితోషికం ఇవ్వబడును.కావాలంటే " నవ్వు కనబడుటలేదు" కథ చదవండి.
ప్రతీకథలో హాస్యం పెదవులపై విరబూసే ఆయుష్షును ఇస్తుంది.
కరోనా ఒత్తిడిలో " నవ్వుదేవుడొచ్చాడోచ్" కాసేపు ఒత్తిడిని మరిచిపోయేలా చేసింది.అన్నికథల్లో నవ్వు అంతర్లీనంగా వుంది.చదువుతున్నప్పుడు,చదివాకా,మళ్ళీ గుర్తు చేసుకున్నప్పుడు కూడా పెదవుల మీదికి నవ్వొచ్చేస్తుంది.నిజంగా నవ్వుదేవుడు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్లజంట్ గా అనిపించింది.స్వాతి వీకెల్లీలో పదివేల బహుమతి వచ్చిన కథగా ఈ కథ చదివాను.అలాగే నవ్వు,కనబడుటలేదు,లాఫింగ్ ట్రీ,కథలన్నీ చదివి ఒత్తిడిని మరిచిపోయేలా వున్నాయి.
కరోనా ఒత్తిడిలో మనసారా నవ్వుకునేలా చేసిన కథలు.విభిన్నమైన సబ్జక్ట్స్, అద్భుతమైన కథనం,పదాల్లో పంచ్ ,వెరసి నిజంగా నవ్వు దేవుడొచ్చి నవ్వమని వరమిచ్చినట్టే వుంది.
బాధలన్నీ మరిచిపోయి మనఃస్ఫూర్తిగా నవ్వించిన కథలు.కథల్లోని పాత్రలు,పలికించిన హాస్యం అందించిన ఆహ్లాదం వెలకట్టలేనిది.విభిన్నమైన కథలతో మళ్లీమళ్లీ చదవాలని అనిపించినా కథలు.లాక్ డౌన్ లో ఒత్తిడిని తగ్గించి కొత్తప్రపంచానికి తీసుకువెళ్లిన " నవ్వు దేవుడొచ్చాడోచ్ "ఈ పుస్తకం రూపంలో వచ్చాడు.
నవ్వు కనబడుటలేదు,అనే కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇస్తే అనే ఆలోచన చదవడానికి ఆసక్తికరంగా వుంది.
మనకు ఎందరో దేవుళ్లున్నారు,కానీ నవ్వుదేవుడు లేడు,విజయార్కె గారు సృష్టించిన నవ్వు దేవుడికి స్వాగతం చెబుతూ నవ్వుదేవుడు మన ఇళ్లలోనే ఉండేలా చేసుకుందాం.
ప్రతీకథ హాస్యంలో రంగరించిన మిఠాయి.ఇంతమంచి పుస్తకాన్ని అందించిన కినిగెకు ధన్యవాదాలు.విజయార్కె గారి రచనాశైలి అద్భుతం .వీటిని ఎవరైనా వెబ్ సిరీస్ గా తీస్తే పాఠకులకు ప్రేక్షకులకు నవ్వుల పండుగే.
ఈ బిజీ లైఫ్ లో ఒత్తిళ్ల మధ్య మనసారా నవ్వుకునే కథలు,మనస్సుకు ప్లజంట్ ను కలిగించే కథలు.ప్రతీకథ దృశ్యంలా కనిపిస్తుంది.మాటల్లో హాస్యం తొణికిసలాడుతుంది.కామెడీ వెబ్ సిరీస్ తీస్తే మనలోని ఒత్తిడికి మాంచి కిక్కు ఇచ్చే కామెడీ థెరపీ అవుతుంది.
నవ్వు కనబడుటలేవు అనే కంప్లైంట్ ఐడియా సూపర్బ్
నవ్వుచెట్టు ఉంటుందా,?అనే కాన్సెప్ట్ అదుర్స్ .ప్రతీకథలో నవ్వు అండర్ కరెంట్ గా సందేశాన్ని ఇస్తూ,నవ్విస్తుంది.మన ఆయుష్షును పొడిగిస్తుంది.
మనలోని ఒత్తిడిని తగ్గిస్తూ,కథలతో నవ్విస్తూ " నవ్వు దేవుడిని " సృష్టించిన విజయార్కె గారికి,ఇలాంటి మంచి రచనలను అందిస్తున్న కినిగె వారికి, ఆదరిస్తున్న కినిగె పాఠకులకు వినాయచవితి శుభాకాంక్షలు.
మనసారా నవ్వుకునే ఈ కథలను ప్రతీఒక్కరూ చదవాలి.కాసేపు బాధలను పక్కనపెట్టి శాశ్వతంగా నవ్వుకోవాలి.
నవ్వు దేవుడి కోసం తపస్సు చేసాడు.తనను దేవుడిని చేయమని అడిగాడు.దేవుడు నవ్వుని "నవ్వు దేవుడిని" చేసాడు.అప్పటి నుంచి ప్రపంచంలో వింత మార్పులు..?నవ్వు దేవుడికి గుడులెక్కడ?నవ్వు దేవుడెక్కడ? తెలుసుకోవాలంటే "నవ్వు దేవుడొచ్చాడోచ్" కథ చదవాలి
ఇంకా ఇలాంటి కథలు బోలెడు.
నవ్వేచెట్టు నవ్వించే చెట్టు...కనబడని నవ్వుకోసం కంప్లైంట్ ఇచ్చిన వైనం,జపాన్ బొమ్మ వైఫ్ లా మరహ్..ఆ మొగుడి ఇక్కట్లు...
నవ్వుల మెనూలో కథల వంటకాల ఘుమఘుమలు.ఇకపకలు.నవ్వుకున్నవారికి నవ్వుకున్నంత.
వినాయచవితి రోజు మనసారా నవ్వుకునే కథలు చదివే అవకాశం కలిగింది.నవ్వుదేవుడు నిజంగా ఉంటే బావుండు.అందరి పెదవుల మీద నవ్వుదేవుడు ఉండాలని కోరుకుంటూ,వినాయకచవితి శుభాకాంక్షలు.మనలోని ఒత్తిడిని దూరంచేసి డిప్రెషన్ ను తరిమేసే నవ్వుకథలకు నవ్వుదేవుడికి స్వాగతం పలుకుదాం.