• Navayogulu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • నవయోగులు

  Navayogulu

  Publisher: Mohan Publications

  Pages: 140
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, ధన్యభూమి, ఇక్కడ ఎందరో మహానుభావులు జన్మించారు. ఇతిహాసాలుగా చెప్పబడే భారత, రామాయణాలు వంటి పురాణాలు జరిగిన పుణ్యభూమి. ఎందరో నాస్తికులను తన మహిమ వలన ఆస్థికులుగా మార్చినది. ఇక్కడ ఎందరో అవతార పురుషులు జన్మనెత్తారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో చెప్పబడిన రఘునందనుడు శ్రీరాముడు , యశోదానందనడు శ్రీకృష్ణుడు ఇక్కడ జన్మించినవారే. కొందరు నాస్థికులు శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని నమ్మకపోయినా బ్రహ్మంగారిని, రాఘవేంద్రస్వామిని, వెంకటయ్యస్వామిని మొదలగు మానవజన్మనెత్తిన అవధూతలను నమ్ముతారు. భగవంతుడు కనిపించలేదని బాధపడతారుగాని నిజంగా ఆయనే కళ్ళ ముందు కనబడితే చూడగలిగేవారు ఉన్నారా? అందుకనే భగవంతుడు తన ఉనికి సభ్యసమాజానికి తెలియజేయడానికి కొన్ని అవతారాలను ఎత్తవలసి వస్తుంది. అలా మానవ సమాజంలో జన్మించిన వారిని స్వామిగా భావించి పూజలు చేస్తారు. మానవులను భక్తిమార్గంవైపు మళ్ళించ గలిగిన మహానుభావులను అవధూతలు అంటారు. వీరు తమ బోధనల ద్వారాభక్తి మార్గం వైపు మనల్ని మళ్ళిస్తారు. అటువంటి అవధూతలు కన్యాకుమారి నుండి హిమాలయాల వరకూ ఎందరో ఉన్నారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదులతో పవిత్రమయిన ఆంధ్రదేశం అవధూతల గురించి తెలుసుకుందాం.

Preview download free pdf of this Telugu book is available at Navayogulu