-
-
నవల - ప్రజలు
Navala Prajalu
Author: Ralph Fox
Publisher: Navachetana Publishing House
Pages: 145Language: Telugu
Description
రష్యాలోనూ, తూర్పు యూరోపియన్ దేశాల్లోనూ మార్క్సిజం శాశ్వతంగా కూలిపోయిందని చాలా మంది భావిస్తున్న ఈ తరుణంలో రాల్ఫ్ఫాక్స్ను అనువదించటమేమిటని కొందరు ఆశ్చర్యపోవచ్చు. కానీ రాల్ఫ్ఫాక్స్ను అనువదించటానికి ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. అతడు రాసిన "నవల - ప్రజలు” అన్న ఈ పుస్తకమూ, ఇతర సాహిత్య, రాజకీయ వ్యాసాలూ ఈనాడు మరింత శ్రద్ధగా చదవాల్సిన అవసరం ఉంది. తూర్పు యూరోపియన్ దేశాల్లో జరిగిన పరిణామాలు తప్పుదారి పట్టిన మార్క్సిస్టు రాజకీయాలను మన దృష్టికి తీసుకువచ్చినట్టే మార్క్సిస్టు సాహిత్య విమర్శలో జరిగిన, జరుగుతూ ఉన్న తప్పిదాలను రాల్ఫ్ఫాక్స్ మన దృష్టికి తీసుకువస్తాడు. అతని అభిప్రాయాలతో మనం ఏకీభవించినా, ఏకీభవించకపోయినా సాహిత్య మేధావులందరూ రాల్ఫ్ఫాక్స్ రచనల్ని శ్రద్ధగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది.
- పల్లంపాటి వెంకటసుబ్బయ్య
Preview download free pdf of this Telugu book is available at Navala Prajalu
Login to add a comment
Subscribe to latest comments
