• Nava Rasakandayam
 • Ebook Hide Help
  ₹ 60 for 30 days
  ₹ 180
  200
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • నవ - రసకందాయం

  Nava Rasakandayam

  Author:

  Pages: 270
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

డా. మోహన్ కందా ఐఏఎస్ (రిటైర్డ్) గారు ఎన్నో సమున్నత పదవులను నిర్వహించిన అనుభవశాలి. సరళహృదయులు. నిరాడంబరత, వినయము వారి వ్యక్తిత్వమందు మెరుపులు. తెలుగుభాషపై చక్కని పట్టున్నవారు. నిత్యవిద్యార్థి.

ఉన్నత పదవులను నిర్వహించినప్పుడూ, రాజ్యాంగ పదవులలో వున్న పెద్దలతో నిత్యసమన్వయం కాగలిగినప్పుడూ, ఎన్నో అనుభవాలు కలుగుతాయి. అవి అందరికసాధ్యమయ్యేవి కావు. కానీ అవి నలుగురితో పంచుకుంటే, చదివినవారి జీవితాలు దిద్దుకోవడానికి మంచి కరదీపికలవుతాయి.

డా. మోహన్ కందా గారు రచించిన “నవ రసకందాయం ” (అవీ, యివీ, అన్నీ) అనబడే యీ గ్రంథం నుండి విద్యార్థులు నేర్చుకోవలసినవి ఎన్నో, ఎన్నెన్నో ఉన్నాయి.

- చాగంటి కోటేశ్వరరావు

గౌరవనీయులు మా పూర్వప్రధాన కార్యదర్శి శ్రీమోహన్ కందాగారు వ్రాసిన ఈ వ్యాసాలు పలువురికి ఉపయోగపడే ఓ గ్రంథరూపములో తయారవటము ముదావహము. ప్రత్యేకముగా ప్రజాజీవితంలో ప్రవేశించే వారందరికి ఈ వ్యాసమంజరి నవరసాల రుచులు అందిస్తుందని నేను నమ్ముతున్నాను.

ఒక జూనియర్‌‌గా నేను వారిని అతి దగ్గర నుంచి పలు సందర్భాలలో చూసే అవకాశము కల్గింది. వారి చమత్కారపూరిత సంభాషణాశైలి, మనము పూర్తిగా సమస్య తెల్పక ముందే వారు సమాధానంతో సిద్ధంగా ఉండడము వారికున్న విశిష్ఠ లక్షణాలుగా నేను భావిస్తాను.

పరిమితముగా సంభాషించుట, నిర్మొహమాటముగా చేసే విశ్లేషణ వారి యితర సుగుణాలు. ఈ లక్షణాలన్నీ ఈ వ్యాసములలో మనకు తారసపడతాయి. వారు చారిత్రాత్మక విషయాలు సరళమైన తెలుగు భాషలో పొందుపఱచి మానవాళికి అందించి గొప్ప మేలు చేశారు.

ఈ సంపుటి ఉన్నత విలువల ఆచరణకు ఎంత ఉపయోగమో విశేషమైన వ్యక్తిత్వప్రతిభకు కూడా అంతే ఉపయోగ పడగలదు. ఆత్మకథ వ్రాసే ఫక్కీలో వారు అనేక విశేషాలు ఈ వ్యాసాలలో కుమ్మరించి, జాతీయ, అంతర్జాతీయ విశేషాలను మేళవించారు.

రాష్ట్రప్రభుత్వాలలో పనిచేస్తున్న అనేకమందికి ఈ వ్యాసాల సంపుటి మార్గదర్శనం కాగలదు. సునిశితమైన అనేక వర్తమాన రాజకీయ అంశాల గురించి చాలా హుందాగా వారి పరిశీలనలు మానవాళికి అందించారు.

- లంక వేంకట సుబ్రహ్మణ్యం

గమనిక: " నవ - రసకందాయం" ఈబుక్ సైజు 14.7 mb

Preview download free pdf of this Telugu book is available at Nava Rasakandayam