• Nastikatvam Abhivruddhi Charitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135.6
    150
    9.6% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాస్తికత్వం అభివృద్ధి చరిత్ర

    Nastikatvam Abhivruddhi Charitra

    Publisher: Vasavya Book House

    Pages: 62
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మతానికి, నాస్తికత్వానికి మధ్య బానిస ప్రవృత్తికి, బాధ్యతాయుత సేచ్ఛా ప్రవృత్తికి మధ్య సంధికాలంలో మనం ఉన్నాం. మతవ్యవస్థపై, దైవభావంపై నమ్మకం సడలిపోయింది. కాని నాస్తికత్వం జీవిత విధానంగా అన్ని రంగాలలోనూ ప్రతిబింబిస్తూ ఇంకా వ్యాప్తి చెందలేదు. అలాగే బానిస ప్రవృత్తిపై అసహ్యత ఏర్పడింది. కాని అచరణకి, అలోచనకి, అనుభవాలకు, అవగాహనకు మానవుడు కేంద్రమని, బాధ్యతతోను, స్వేచ్ఛతోను, కృషితోను జీవిత రంగాలలో కావలసిన మార్పులను, ఆలోచనల్లో రావాల్సిన చేర్పులను మానవుడే రూపొందించుకోవాలని ఇంకా పూర్తిగా భావించడం లేదు.

ఇటువంటి సమయంలో మానవుడిని కేంద్రం చేస్తూ నాస్తిక అవగాహన, నాస్తిక అచరణ మేళవించి నాస్తికత్వాన్ని ఒక పాజిటివ్ జీవిత విధానంగా గోరా ప్రతిపాదించారు.

నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేదనటమో, మూఢనమ్మకాలను వ్యతిరేకించడమో, కులవ్యవస్థను కాదనటమోకాదు. మన చుట్టూ ఉండే పరిసరాలలో మానవుని ఆధిక్యతను గుర్తించి దైవభావానికిగాని, విధి వ్రాతకు గాని కర్మ జన్మ పరంపరకుగాని మానవుడు లోబడిలేడని, అలాగే పరిస్థితుల ప్రవాహంలోగాని, విశ్వ నియమాల అల్లికలోగాని మానవుడు భాగం కాదనిన్నీ, పరిసరాలను అర్థంచేసుకోవడంలో మానవుడు వీటిని సాధనాలుగా ప్రతిపాదించుకొంటున్నాడని, అందుచేత ఎప్పటి కప్పుడు క్రొత్తగా సంతరించుకునే జ్ఞానము, అనుభవము, సాధనాలవల్ల క్రొత్త క్రొత్త ప్రతిపాదనలను మానవుడు ఏర్పరచుకోగలడని నాస్తికత్వం గుర్తిస్తుంది. ఇటువంటి గుర్తింపుపై ఏర్పడిన జీవితవిధానంలో అసమానతలకు, అసత్యాలకు, దోపిడీకి స్థానం ఉండదు. అప్పుడు మానవ జీవితపు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక రంగాలలో సమాన గౌరవం, సమాన అవకాశం, సమాన అధికారం, సమాన సంతృప్తి ఏర్పడి మనిషిని మనిషి దోపిడీ చేసుకొనుటకు ఆస్కారం ఉండదు.

ఇంతవరకూ నాస్తికత్వాన్ని కేవలం నిరీశ్వరవాదంగానే తీసుకోవడంచేత పాజిటివ్ నాస్తికత్వాన్ని అర్ధం చేసుకుని స్వీకరించుటకు కొంత సమయం పట్టవచ్చు. అలా అర్ధం చేసుకొనుటలో ఈ పుస్తకం కొంతవరకైనా తోడ్పడుతుందని ఆశిస్తున్నాను.

- లవణం

Preview download free pdf of this Telugu book is available at Nastikatvam Abhivruddhi Charitra