-
-
నసీరుద్దీన్ నవ్వుల కథలు
Naseeruddin Navvula Kathalu
Author: Saili
Publisher: Victory Publishers
Pages: 31Language: Telugu
"బాలల కథా సర్వస్వము" శీర్షికతో విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు అందిస్తున్న బాల సాహిత్యంలో నసీరుద్దీన్ కథల సంకలనం ఈ ఈ-బుక్. ఇందులో 37 కథలు ఉన్నాయి.
* * *
ఒకసారి నసీరుద్దీన్ పగటిపూట ఎక్కడకు వెళ్ళకుండా ఇంట్లోనే పడుకుని హాయిగా గుర్రుపెడుతూ నిద్ర పోతున్నాడు. ఒక యువకుడు నసీరుద్దీన్ ఇంటి ముందు కొచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ నసీరుద్దీన్ భార్యను
పిలవసాగాడు. నసీరుద్దీన్కి మెలకువ వచ్చింది. తనని కాకుండ తన భార్యను పిలుస్తోంది ఎవరా? అని బయటకు వచ్చాడు.
వెంటనే ఆ యువకుడు కంగారుగా "అయ్యా ముల్లా నసీరుద్దీన్ని మసీదు వీధిలో ఒక గుర్రపు బండి గుద్దుకుంది. దాని క్రింద పడ్డాడు. పెద్ద గాయాలయ్యాయి త్వరగా రండి..." అన్నాడు.
''అలాగా అతను నా అంత ఎత్తే ఉన్నాడా?''
''ఉన్నాడు''
''నాకులా అతనికి తలపాగా, గడ్డం ఉన్నాయా?''
''ఉన్నాయి''
''అందరూ'' ముల్లా అని పిలుస్తున్నారా?"
''అవును అలాగే పిలుస్తున్నారు.''
''అయితే ఖచ్చితంగా నేనే అయి ఉంటాను... అయినా ఆఖరుగా చిన్న అనుమానం బండి క్రింద పడ్డవాడు వేసుకున్నది పసుపు రంగు అంగీనేనా?''
''కాదు నీలం రంగుది''
హమ్మయ్య! బ్రతికించావు అల్లా నీకు మేలు చేస్తాడు.. నాకసలు నీలంరంగు అంగీలేదు, కనుక బండి క్రింద పింది నేనుకాదు. ఈ విషయం వెళ్ళి వీధుల్లో వాళ్ళకు కూడ చెప్పు." అన్నాడు.
* * *
చక్కని ఇతివృత్తాలతోనూ, తేలికైన పదాలతోనూ, కథకి తగ్గట్టు అందమైన బొమ్మలతో ఉన్న ఈ పుస్తకం పిల్లలనే కాకుండా పెద్దలనూ ఆకట్టుకుంటుంది.
గమనిక: "నసీరుద్దీన్ నవ్వుల కథలు" ఈబుక్ సైజు 7.78 mb
