-
-
నరావతారం
Naravataram
Author: Nanduri Ramamohana Rao
Publisher: Victory Publishers
Pages: 216Language: Telugu
విష్ణ్వవతారాలను గురించి వ్రాయగలిగినవారు, వ్రాస్తున్నవారు మనకు వేనవేలు. నరావతారాన్ని వ్రాయగలిగినవారు, వ్రాస్తున్నవారు పట్టుమని పదిమందికూడా లేరేమో!
మన వాల్మీకివలె హోమర్ కూడా ప్రాచీనుడే. అయినా, హోమర్ పౌరాణిక గాథలను ప్రశ్నించడానికి యురిపిడెజ్ (Euripedes) వెనుదీయలేదు. ఇది జరిగింది నిన్ననో, మొన్ననో కాదు. రెండున్నర వేల సంవత్సరాలనాడు!
యురిపిడెజ్ కాలం తర్వాత మానవ విజ్ఞాన పరిధులు ఎంతగానో విస్తరించాయి. ఈ విస్తరణ కడచిన అర్ధ శతాబ్దిలో, ముఖ్యంగా కడచిన రెండున్నర దశాబ్దాలలో మానవ చరిత్రలోనే అపూర్వంగా జరిగింది! నానాటికి మరింత శీఘ్రగతిలో, మరింత మహోధృతంగా ఇది జరుగుతున్నది. మరొకవిధంగా దీన్ని వర్ణించడం సాధ్యం కావడంలేదు.
కాబట్టి, దీన్ని “ఎక్స్ప్లోజన్” (Explosion) అంటున్నారు. అయినా మనం మాత్రం మానసికంగా మన పురాణ యుగంనుంచి బయట పడడంలేదు. వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో జరిగిన, జరుగుతున్న, మహావిప్లవం సంగతి మనకు తెలియదా? తెలియకేమి? తెలుసు, చాలావరకు తెలుసు. అయినా, పౌరాణిక యుగం చెరసాలకు, దాని చీకటికి అలవాటు పడిన మనం దాని గోడలను దాటి బయటికి అడుగుపెట్టలేకపోతున్నాము. పగటి వెలుగును చూడలేకపోతున్నాము.
ఈ దౌర్భాగ్యస్థితి కొనసాగినంతవరకు మనకు నిజమైన ప్రగతి లేదు. ఆధునిక ప్రపంచంలో గౌరవ స్థానమైనా లేదు. మన దేశంలో వైజ్ఞానిక, సాంకేతిక విద్యలు ఎంతగానైనా పెరగవచ్చు. ఈ విద్యలో పట్టభద్రుల సంఖ్య ఎంతగానైనా పెరగవచ్చు. అయినా, మన చిత్తవృత్తిలో మార్పు రానంత వరకు మన ప్రగతి నామమాత్రమైనదే కాగలదు, మన భవిష్యత్తు సంశయాస్పదమైనదే కాగలదు.
- నార్ల వెంకటేశ్వరరావు
i have read