-
-
నన్ను రక్షించండి ... ప్లీజ్
Nannu Rakshinchandi Please
Author: P. S. Narayana
Pages: 322Language: Telugu
చటుక్కున మెళుకువ వచ్చింది చక్రధరానికి. ఫోను గణగణా మ్రోగుతున్నది. ఆ యింటికి ఆ మ్రోత కొత్త. లేచి కూర్చున్నాడు.
అర్ధరాత్రప్పుడు ఫోను మ్రోగడం విచిత్రంగా అనిపించింది అతడికి. ఫోను వచ్చిన కొన్ని గంటలలోనే అర్ధరాత్రి తన కోసం ఎవరో ఫోను చేశారూ అంటే కాస్త కంగారుపడ్డాడు. పక్కనే పడుకున్న రాజేశ్వరిని తట్టి లేపాడు, “ఫోను మ్రోగుతున్నదే!” అంటూ.
ఆమె విసుగ్గా కళ్ళు తెరిచి, “మీకు ప్రతిదీ విచిత్రమే... ఫోను యింట్లో వుంటే మ్రోగక చస్తుందా!” అన్నది. అంటూనే తనూ లేచి కూర్చొన్నది ఎవర్ దగ్గరనుంచి వచ్చిందో తెలుసుకుందా అన్నట్లుగా.
చక్రధరం మంచం దిగి, ఫోను పెట్టిన టేబుల్ దగ్గరకు వెళ్ళి, ‘చేసివుంటారబ్బా ఇంత రాత్రిపూట’ అనుకుంటూ ఫోనెత్తాడు.
“హలోవ్.... చక్రధరాన్ని మాట్లాడుతున్నాను! అన్నాడు.
“హలోవ్.... హలోవ్... రక్షించండి....రక్షించండి... నన్ను చంపేస్తున్నారు... నా గొంతు పి..సి..కే..స్తు..న్నా..” చివరకు కీచుగొంతుకతో కేక... ఫోను కట్టయింది.
