-
-
నామిని ఇస్కూలు పుస్తకం
Namini Ischoolu Pustakam
Author: Namini
Publisher: Tom Sawyer Books
Pages: 323Language: Telugu
To
The Correspondent,
Socrates High School,
Bairagi Patteda, Tirupati.
Dear Sir,
I am suffering from Tirumala Hills. So, Please grant me one day leave.
Yours Sincerely,
K. Vani,
5th Class.
లీవు లెటర్లను రాయడనికి అయ్యవార్లు, Suffering from fever, from head ache, from stomach ache అని గుడ్డి వాటంగా చెప్తా వుంటారు కదా ! ఆ పిల్ల Suffering దగ్గిరకొచ్చే సరికి Tirumala hills అని fill up చేసింది. ఆ రోజు ఆ పిల్ల - అమ్మా నాయినతో కూడ కొండకు పోతా వుంది. అదీ కత.
* * *
మునక్కాయ ముప్పావలా లెక్కన ముసలవ్వ వీధిలో మునక్కాయలమ్ముతోంది. ఒక బీదరాలు ఆ అవ్వ దగ్గిర మూడు మునక్కాయల్ని కొనుక్కుంది. ముసలవ్వ చేతిలోకి రెండుం పావలా, బీదరాలి చేతికి మూడు మునక్కాయలూ చేరిపొయ్యాయి. చదువూ సంధ్యాలేని వాళ్లిద్దరి మధ్యా భిన్నాలకు సంబంధించీ, దశాంశ స్థానాలకు సంబంధించీ, వొక పెద్ద లెక్క గుట్టు చప్పుడు గాకుండా జరిగిపోయింది!
3/4 X 3 = 2.25 (లేదా) 0.75 X 3 = 2.25
మూడో మనిషికి తెలీకుండా జరిగిపోయిన ఈ లెక్క ఎగురుకుంటూ స్కూలుకు వచ్చిందనుకోండి. ఒక బోర్డూ, చాక్ పీసుల బాక్సూ, వొక పుస్తకం, నాలుగు బెత్తాలూ, వొక డిగ్రీ హోల్డరూ, ఇంకా బి.ఇడి. తోకా... శవం పడిన ఇల్లు మాదిర్తో ఏడుపులూ, పెడ బొబ్బలూ...!
పిల్లల కోసం, పిల్లలున్న పెద్దల కోసం నామిని ఇస్కూలు పుస్తకం !
