-
-
నలుపు, తెలుపు, కొన్ని రంగులు
Nalupu Telupu Konni Rangulu
Author: Ranganatha Ramachandra Rao
Publisher: Lakshmi Prachuranalu
Pages: 136Language: Telugu
Description
ఈ అనువాద కథా సంకలనంలోని కథలన్నీ స్త్రీలు రాసినవే. ఇంతకు పూర్వం కన్నడ కల్పనా సాహిత్య రచయితలంటే మాస్తి వెంకటేశ్ అయ్యంగార్, లంకేశ్, స్త్రీలలో అయితే త్రివేణి వంటి కొందరే పరిచయం ఉండేవారు. అందుకే ఇప్పుడు సుప్రసిద్ధులైన కొందరు రచయిత్రులను పరిచయం చేసి, రంగనాథ రామచంద్రరావుగారు మనకు కన్నడ రచయిత్రుల కథల్లోని మేలిమిని చూపగలిగారు.
ఈ కథలన్నీ చదివాక ఎక్కువ శాతం కథల్లో ఉన్న పాజిటివ్ దృక్పథం మనల్ని ఆకట్టుకుంటుంది. మనుషుల్లో మంచితనంపైనా, జీవితాన్ని ఎదుర్కోవడంలో వారికున్న ధైర్యంపైనా, నమ్మకం కలిగించే దృష్టి ఈ కథల్లో ఉంది. కథలు చెప్పిన విధానంలో ఎక్కడ అనవసర భేషజాలు, కృత్రిమ శిల్పాలు లేవు. హాయిగా చదివించే కథలు. దానికి ముఖ్య కారణం రంగనాథ రామచంద్రరావుగారి అనువాదమనే చెప్పాలి. సరళంగా, చక్కగా ఉన్న అనువాదం వల్ల పఠనీయత సమృద్ధిగా ఉంది.
- డా. మృణాళిని
Preview download free pdf of this Telugu book is available at Nalupu Telupu Konni Rangulu
Login to add a comment
Subscribe to latest comments
