• Nalnalugula Padahaaru
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాల్నాలుగుల పదహారు

    Nalnalugula Padahaaru

    Publisher: Mitra Prachuranalu

    Pages: 162
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

నలుగురు రచయితల కథలను కలిసి ఒక పుస్తకంగా వెయ్యాలన్న ఆలోచనకి కారణం కేవలం ఆర్థికం మాత్రమే కాదు. ప్రచురణ వ్యయం పెరిగిపోయి, రచయితలే ప్రచురణకర్తలుగా మారుతున్న ఈ సందర్భంలో ఇలాంటి ప్రయత్నం ఆర్థికంగా రచయితలకు కాస్త వెసులుబాటు ఇచ్చే మాట వాస్తవమే. అయితే మేము కోరుకున్నది వేరే. మేము నలుగురం విడివిడిగా కథా సంకలనాలను వెలువరించాము. ఆ కథలను కూడ పాఠకులు ఆదరించి అభినందించారు. కానీ అవన్నీ ఒకే పూల గుచ్ఛాల వంటివి. ఇప్పుడు మేము చేస్తున్న ప్రయత్నం రకరకాల పూలను కూర్చి ఒక మాలగా అల్లాం. రెండింటిలో పఠనానుభూతి వేరుగా వుంటుందన్న నమ్మకమే ఈ పుస్తకం వెయ్యడానికి మూల కారణం. ఆ విధంగా నలుగురు రచయితల నాలుగేసి కథలతో అల్లిన నాల్నాలుగుల పదహారు ఇప్పుడు మీ చేతిలో వుంది.

ఇద్దరు తెలుగువాళ్ళు వున్న చోట మూడు సంఘాలు ఏర్పడతాయని ఒక జోక్‌. అలాంటిది నలుగురు రచయితలు కలిసి ఒకే పుస్తకాన్ని వెలువరించడం అరుదనే చెప్పాలి. పైగా ఈ పుస్తకంగా వున్న కథలు ఒకే రకమైన భావజాలంతోనో, వాదంతోనో రాసినవి కావు. ఇందులో ప్రతి కథ ప్రత్యేకం. ప్రతి రచయిత ప్రత్యేకం. అందువల్ల ఏదో ఒక భావజాల వ్యాప్తి కోసమో, మరో ప్రతిఫలాపేక్షతోనే ఈ సంకలనం చెయ్యలేదు. కేవలం కథ మీద వున్న మమకారంతో, మంచి రచనకు పాఠకుల ఆదరణ వుంటుందన్న నమ్మకంతో మాత్రమే ఈ పుస్తకం తీసుకురావటం జరిగింది. గతంలో ఇలాంటి ప్రయత్నాలు అనేకం జరిగాయి. అలాంటి ప్రయోగాలకు ఈ పుస్తకం మరో కొనసాగింపుగా భావించవచ్చు. ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలన్న మా ఆశకు మీ ఆదరణ తోడౌతుందనే నమ్ముతున్నాము.

- కన్నెగంటి అనసూయ, సమ్మెట ఉమాదేవి, అరిపిరాల సత్యప్రసాద్‌, వడలి రాధాకృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Nalnalugula Padahaaru