-
-
నల్లమిల్లోరిపాలెం కథలు
Nallamillori Palem Kathalu
Author: Vamsy
Publisher: Kutty Mass Press
Pages: 371Language: Telugu
ఈ నల్లమిల్లోరిపాలెం కథలు సంకలనంలో ఉన్న 42 కథలు వంశీ శైలిలో వివిధ పార్శ్వాలకి ఉదాహరణలుగా నిలుస్తాయి. ఆసక్తిగా చదివిస్తాయి. కొన్ని కథలు మనస్సుకు గాఢంగా హత్తుకుంటాయి. కొన్ని పాత్రలు గుండెల్ని గట్టిగా తడతాయి. కొన్ని కథల్లో వంశీ ఒక పాత్రలా ఉండటం మనం ఇంతకు ముందు చాలాసార్లు చూశాం, ఆ కథల్లో నిజమెంత, కల్పన ఎంత అన్నది మనకు ప్రశ్నగా మిగులుతూ ఉంటుంది. ఈ సంపుటిలో మాత్రం కొన్ని నిజజీవితపు కథలున్నాయి. వాటిలో కొన్ని వంశీ స్వంత కథలు. మరికొన్ని అతనికి తెలిసిన మనుషుల కథలు. ఈ పుస్తకంలో ఉన్న కాల్పనిక కథల కన్నా, ఈ నిజజీవితపు కథలు (ఉదాహరణకి పాతూరి వెంకటసుబ్బమ్మ గారు, కుతుకులూరి సత్తిరెడ్డిగారి రెండో అబ్బాయి) ఇంకా అబ్బురంగా అనిపించాయి. కల్పనకన్నా జీవితంలోనే నాటకీయత ఎక్కువ ఉంటుంది అని ఈ కథలు నిరూపిస్తాయి.
- డా. జంపాల చౌదరి
గమనిక: " నల్లమిల్లోరి పాలెం కథలు" ఈబుక్ సైజు 17.8 mb
