-
-
నల్లమలలో చెంచు ప్రపంచం
Nallamalalo Chenchu Prapancham
Author: Sivaramkrishna SAKTI
Publisher: Self Published on Kinige
Pages: 162Language: Telugu
తెలుగుదేశానికి మధ్యలోఉన్న ఈఅడవులు ఎందరో ఓడిపోయిన రాజులకు ఆశ్రయమిచ్చాయి. అలాటంకోట, పచ్చిబోయలకోట, మంతనాలకోటలు, కోటలకు తీర్చిన గుర్రపుబాటలు, మధ్యమధ్య కనిపించే శాసనాలు, దేవాలయాలు, దిగుడు బావులు, చెరువులు ఆ చుట్టుపట్ల పాడుపడి, కంపపెరిగిన పొలాలు ఈ అడవి అంతా కనిపిస్తాయి. పెచ్చెరువు గ్రామం శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన పెద్దచెరువు. ఇలా వచ్చే - పోయే రాజకీయమైన పరిణామాలు చెంచుజీవనవిధానంలో తెచ్చిన మార్పుకంటె, గత 150-200 ఏళ్లుగా చెంచులతో స్థిరపడిన సుగాలీలతో చెంచులు ఎదుర్కొంటున్నపోటీ క్రమంగా తీవ్ర తరమౌతున్నది. సుగాలీలు వ్యాపారులు, పశుపాలకులు, వ్యవసాయదారులు కావడంవలన, వారి సహజీవనంతో చెంచులు వెనకబడిపోతున్నారు. చెంచులను అభయారణ్యం బయటకు పంపిస్తున్నదిగాని. సుగాలీలనుగాని గిరిజనేతరులనుగాని ముట్టుకునే దమ్ములు ప్రభుత్వానికి లేవు.
చెంచులవ్యసాయమంతా దిగువ పద్ధతిలోనే సాగుతుంది. ధాన్యాన్ని నిలువ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఇంటిముందు గాదెలు ఉంటాయి. పశువులకోసం సపారం (రెండురెక్కల పాక) వేసుకుంటారు. నిన్న మొన్నటి వ్యవసాయం, కొద్దిచేలు కావడంవలన చెంచులకుటుంబాలలో గృహ నిర్మాణంలో వచ్చిన మార్పేమీ లేదు. తేనెలుతీసే చెంచులు, అడవి చిగురించడం, పూలువికసించంతో దొరికే తేనెలతో బుతువులు గుర్తిస్తారు. నల్లమలలు గాడిదలు మాత్రమే తిరుగగల కురవలు. అవే అక్కడి రవాణా సాధనాలు.
A very informative book covering various aspects of Traditional knowledge and lifestyle of Chenchu tribes. Documentation of sustainable practices has become more relevant than-ever before in the wake of climatic change and people getting back to older and wiser ways of food production. I thank the author for documenting these traditional wisdom with such passion, dedication and foresight, that we do have a great wealth of knowledge for reference now. It is going to be a torchbearer for the coming generations who would look at things afresh ...from the ecosystem point of view.
This very interesting book.