-
-
నైవేద్యం
Naivedyam
Author: Simha Prasad
Publisher: Sri Sri Prachuranalu
Pages: 275Language: Telugu
ఇది "నైవేద్యం", "హింస ధ్వని", "అనగనగా ఒక ఊరు" అనే మూడు నవలికలు ఉన్న ఈబుక్. మూడు విభిన్న నేపథ్యాలలో జరిగిన మూడు రకాల సమస్యాత్మక సంఘటనలని ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక సమాజం ఎదుర్కొన్న తీరుతెన్నుల్ని హృద్యంగా ఆవిష్కరించిన అద్భుత కథాకథన మాలికలు ఇవి.
* * *
తాళి కట్టించుకున్నందుకు భర్తచేత ఒక 'మంచి మాట' అన్పించుకోవాలన్న తపనతో తపస్సుతో నిరీక్షణతో నిర్వేదంతో జీవితాన్ని హారతి కర్పూరం చేసుకున్న ఒక అసహాయ అభాగ్య ఒంటరి మహిళ జీవన యానం "నైవేద్యం".
హంసధ్వని రాగాల ఇంట్లో హింస ధ్వనులు ప్రతిధ్వనించగా ఆ కుటుంబీకుల ఆవేదనా భరిత ఉత్కంఠ ఉద్వేగాలకు ఆశానిరాశలకు అక్షరరూపం "హింస ధ్వని". 'రోజా' సినిమా కన్నా చాలా ముందే వెలువడిన ఆరాట పోరాటాల కథ.
పరివర్తన తీసుకురావడానికి ఉద్దేశించిన శిక్షలు నేరాల్ని ఏమాత్రం అరికట్ట లేకపోతున్న ప్రస్తుత తరుణంలో ఆ పల్లెటూరి వారు తమదైన శైలిలో విధించిన శిక్ష, కొందరికి అనాగరికమన్పించినా, ఆశించిన లక్ష్యాన్ని సాధించింది. ఆ ఊరుమ్మడి విజయమే "అనగనగా ఒక ఊరు".
ఆర్తి, సంఘర్షణ, సజీవపాత్ర చిత్రణ - ముప్పేటగా సాగి గుండెలను మెలి తిప్పుతూ మనస్సుని కదిపి కుదిప్ ఆలోచనల్ని రగిలించే సింహప్రసాద్ వాస్తవిక కథనాలు!
