• Nadustunna Charitra July 2011
 • Ebook Hide Help
  ₹ 60
  60
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • నడుస్తున్న చరిత్ర జులై 2011

  Nadustunna Charitra July 2011

  Publisher: Nadustunna Charitra

  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description
"

నడుస్తున్న చరిత్ర జులై 2011

""1993 నుండి నిరంతరం ప్రచురించబడుతున్న తెలుగుజాతి పత్రిక ఈ నడుస్తున్న చరిత్ర.. జూలై 2011 సంచిక ఇది.

సంపాదక హృదయం

జయశంకర్ కనుమరుగు – తెలంగాణ
జయశంకర్ పెట్టుకున్న లక్ష్యం కొందరికి నచ్చకపోవచ్చు. కాని, తెలంగాణ కోసం అయన తన ఏళ్ళ కొత్తపల్లి జయశంకర్ కాన్సర్‌తో చేసిన పోరాటంలో ఓడిపోయి, ఈ జూన్ 20న కన్నుమూసారు. కానీ, ఆయన తెలంగాణ కోసం జీవితమంతా పోరాడిన తీరు తెలంగాణ ఉద్యమకారుల్లో, జనంలో ఆయనను చిరంజీవిని చేసింది18వ ఏట నుండీ బ్రతికిన కాలమంతా కట్టుబడి వుండడం అచ్చెరువు గొలుపుతుంది. పెళ్ళి చేసుకుంటే గురి చెదురుతుందని ఆనాడే నిర్ణయించుకున్నాడాయన. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు ఒప్పందం జరిగినప్పుడే 1952లో - దానిని జయశంకర్ వ్యతిరేకించాడు. నాటినుండి క్రమక్రమంగా ఆయన తెలంగాణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమస్యలని లోతుగా తరచి చూస్తూ, పరిశోధిస్తూ ముందుకుసాగాడు. ప్రత్యేక తెలంగాణను కోరడానికి తన కారణాలను వందలాది ఉపన్యాసాల్లో, రచనల్లో చాటి చెప్పాడు. ఆయన సభలో మాట్లాడుతుంటే ఆ సంగతులేవీ ఒప్పుకోని వారు కూడా ప్రశాంతంగా వినేట్లుండేది. విడిగా వారితో కూర్చుని చర్చ పెట్టుకున్నా మాటలు హాయిగా సాగేవి.2001 సదస్సు జరిగిన సాయంత్రం, ఆ మర్నాటి వేకువనే ఆయనను రైలు ఎక్కించడానికి నేను వెళ్లినప్పుడు జూలై 15న నడుస్తున్న చరిత్ర 'రాష్ట్రాల పునర్విభజన - ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ' అనే అంశంపై ఒక సదస్సుని నిర్వహించింది. దానిలో వక్తగా జయశంకర్ పాల్గొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే అక్కడి సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఓపికగా వివరించి చెప్పారు. ఎక్కడా ఉద్రేకంగాని, తడబాటు గాని లేదు. పాఠం చెబుతున్నట్లు, నచ్చచెబుతున్నట్లు, వివరిస్తున్నట్లుందే తప్ప రెచ్చగొట్టే ధోరణి లేనే లేదు. విభిన్న అభిప్రాయాలు ప్రకటించడానికి వేదికగా రాజకీయ పార్టీల ఆవేశకావేశాలకు దూరంగా, సమాజం యొక్క మేలు కోరి ఆలోచించడం కోసం సదస్సు ఏర్పాటయింది. ఆ సందర్భంగా జయశంకర్ గారి ప్రసంగ సారాంశాన్నీ, అంతకు ముందు నెలలో నడుస్తున్న చరిత్ర ప్రత్యేకంగా ఆయనతో చేసిన ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని ఈ సంచికలో చదవండి.

దాదాపు 3 గంటలకు పైగా మాట్లాడుకున్న సంగతులు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి. ఆయన ఒక పెద్దమనిషి, మేధావి, చింతనశీలి. తను ఎంచుకున్న రంగంలో, దారిలో ఎదురయ్యే అన్ని అంశాలను తరచి చూసిన తాత్వికుడాయన. అన్నిటికీ మించి తనకు అన్నీ తెలుసుననుకోకుండా ఎదుటి వారు చెప్పేది ఓపిగ్గా విని, తనకు తెలియని వాటిని దాపరికం లేకుండా ఒప్పుకునే వాడాయన. ఆ సదస్సులో తమిళనాడు నుండి పాల్గొన్న ఇద్దరు వక్తల ప్రసంగాలు విని, ఆ తర్వాత నన్నడిగి మరిన్ని సంగతులు తెలుసుకొని, ' మన తెలుగువాళ్ళు బయట రాష్ట్రాల్లో కూడా మనతో సమసంఖ్యలో ఉన్నారా? ఇంతవరకు నాకీ సంగతి సరిగా తెలియదండీ ' అంటూ కపటం లేకుండా మాట్లాడారు. ఆ సదస్సులో ముందుగానే సదస్సు ఉద్దేశాన్ని వివరిస్తూ నేను, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సమయంలో మనకు జరిగిన అన్యాయాల్ని వివరించి, రాష్ట్రేతర తెలుగువారి భాషా సాంస్కృతిక రాజకీయ దుస్థితిని ప్రస్తావించాను. ' ఒక పెద్ద రాష్ట్రంగా సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందనే వాదంతో పాటు భౌగోళికమైన, ఆర్థికపరమైన అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే దాన్ని కూడా నిశితంగా పరిశీలించవలసి ఉంది. ఏది ఏమైనా తెలుగు జాతి సర్వతోముఖ పురోగమనానికి, సాంస్కృతిక సమైక్యతకు దోహదం చేయగల విధంగానే ఆలోచనలు సాగించాలి ' అని సదస్సు గురించి స్పష్టత కలిగించాను. ఇది ఆయనకెంతో నచ్చింది. రైలు కదలబోయే ముందు గట్టిగా చేయి పట్టుకుని నొక్కుతూ, ' మన అభిప్రాయాలలో మౌలికంగా తేడా ఏమీ లేదు. నేను తెలంగాణకు కట్టుబడి పనిచేస్తున్నాను. ఈ సదస్సులో.....

"" "
Preview download free pdf of this Telugu book is available at Nadustunna Charitra July 2011