• Nadu Nedu Sakuntala Adade
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాడూ నేడూ శకుంతల ఆడదే

    Nadu Nedu Sakuntala Adade

    Pages: 78
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతీయ సాహిత్యంలో ''శకుంతల'' పాత్ర అనన్య సామాన్యమైనది. ఇలాంటి పాత్ర వేరొకటి కనిపించదు. దేవవేశ్యకీ, రాజర్షి విశ్వామిత్రునికీ పుత్రికగా జన్మించిన శకుంతలను పుట్టిన క్షణంలోనే తల్లి తండ్రులిద్దరూ బిడ్డను పారవేసి దిక్కులేనిదానను చేశారు. ప్రకృతి దయ తలచింది. పక్షులు పోషించాయి. కణ్వమహర్షికి లభించింది. అక్కడినించి సాగిన ఆమె చిత్రాతిచిత్రమైన కథ భారతీయ రసహృదయాన్ని పాలించింది. పౌరాణిక కథ కనుక ఏ శతాబ్దంలో జరిగినదో, చారిత్రకంగా చెప్పలేం. కానీ తప్పని సరిగా జరిగే ఉంటుంది.

వివాహ వ్యవస్థ ఏర్పడిన తర్వాతనే దాని నుంచి వెసులుబాటు కోరే స్వేచ్ఛా ప్రియులు ఈ గాంధర్వ విధి అనే కూటనీతిని ప్రవేశ పెట్టారు. తమ పబ్బం గడుపుకున్నారు. దుష్యంత మహారాజు ఆ సులువును ఉపయోగించి, ఆమెను అనుభవించాడు. అన్నమాట ప్రకారం ఆమెను తన అంతఃపురానికి తీసుకెళ్ళ లేదు. ఆమె గర్భయుక్తా ఫలంగా ఉదయించిన భరత చక్రవర్తి పేరునే మన దేశం ప్రవర్థిల్లింది. అది ఒక ప్రబల సాక్ష్యం! కనక శకుంతల కథ కల్పితమని తోసి పారవెయ్యలేము.

జనప్రియకవి కాళిదాసు ఈ ఇతివృత్తాన్ని తీసుకొని సుందరమైన నాటకం రాశాడు. ఆ కథా, కధతోపాటు శకుంతల పాత్రా దానితోపాటు నాటకమూ, చిరంజీవులై మనదేశంలో భాసిస్తూనే ఉన్నాయి.

స్త్రీని మొదటగా అబలని చేసి ఆమె ఆధీనంలో ఉన్న హక్కులన్నీ లాక్కుని, నిరాధారంగా చేసి, రకరకాల పీడనలకు గురి చేసిన పురుషజాతి ఆనాటికే ప్రబలి ఈనాటివరకూ బ్రతుకుతూనే ఉంది.

అప్పటికీ, ఇప్పటికీ స్త్రీ ఇలాంటి దుర్మార్గానికి గురవుతూనే ఉంది. అందుకే శకుంతల ఇతివృత్తం సాంఫిుకంగా ప్రగతిశీలమైనదే.

- డా. ఆవంత్స సోమసుందర్

Preview download free pdf of this Telugu book is available at Nadu Nedu Sakuntala Adade