• Nadiche Needalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నడిచే నీడలు

    Nadiche Needalu

    Publisher: Samatha Books

    Pages: 125
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రెండున్నర దశాబ్దాల కాలంలో పత్రికారంగంలో పతనమైపోతున్న విలువలను ప్రతిబింబించే నవల "నడిచే నీడలు".

* * *

శ్రీరామమూర్తి ఎందుకు తెలుగుదీపం పత్రిక నుంచి తప్పుకున్నారన్న విషయంపై పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడతడు.

అంతలోనే శ్రీరామమూర్తి మాట్లాడుతూ "ఈ పేపర్‌ను తీసుకురావడం కోసం అష్టకష్టాలు పడాల్సివచ్చింది. ఎం.డి. గారితో కలసి టీమంతా రేయింబవళ్ళు వర్క్ చేసాం. దీనిని నేటిదినం పత్రికకు ధీటుగా మార్కెట్‌లో నిలబెట్టడానికి శ్రమించాం. ఈ రెండేళ్ళలో పేపర్ బాగా పుంజుకోవడంతో చాలామంది కళ్ళు దీనిపై పడ్దాయి. వార్తల కోసం కాకుండా, కలెక్షన్లు, కమీషన్లు పరమావధిగా బతికే జర్నలిస్టులు కొంతమంది తెలుగుదీపంలోకి రావడం మొదలుపెట్టారు. దాంతో ఏ లక్ష్యంతో పేపర్ ప్రారంభించామో ఆ ఆదర్శాలు, లక్ష్యాలు చెల్లాచెదురైపోయాయి. కలాన్ని నమ్ముకున్న జర్నలిస్టులకు ఆకుల్లో, కులాన్ని నమ్ముకున్న ఎర్నలిస్టులకు కంచాల్లో వడ్డించే ధోరణి ప్రారంభమయ్యింది. అందుకే ఇప్పుడే తప్పుకుంటే మంచిదనే ఉద్దేశ్యంతో బయటకు వచ్చేసాను" అన్నాడు.

"మంచిదే సార్! మీ ప్లేస్‌లో ఎవరు వస్తున్నారు...?" అడిగాడు అశోక్‌వర్ధన్.

"విష్ణుప్రకాశ్ అని ఒకాయన వస్తున్నాడు. ఆయన ఎం.డి.గారి బంధువు అట" చెప్పాడు శ్రీరామమూర్తి.

Preview download free pdf of this Telugu book is available at Nadiche Needalu