-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
నది పలికిన వాక్యం (free)
Nadi Palikina Vakyam - free
Author: Vilasagaram Ravinder
Publisher: Saahithi Sopathi
Pages: 146Language: Telugu
Description
మనసు నిప్పు
రాలిన ఆకులు చిగురించక మానవు
జీవితపు ఆశల్లా
మట్టి పొత్తిల్లలో కలవక తప్పదు.
అన్నీ విజయాలే వుంటే
సాగదా జీవితం సాదాసీదాగా
చర్విత చరణంలా?
దుఃఖ మేఘం తరిమినప్పుడే కదా
గెలుపు గుర్రం మజా తెలిసేది
మనసు నిప్పు ఆరేది
*****
నమ్మకమివ్వు
నిజం నిలక మీద తేలుతుందిఅవును
కట్టతెగి నీళ్ళన్నీ గట్టు దాటినట్లు
ఇరువురిలో ఎవరో ఒకరు
కాలిపోయాక
నిజం నీళ్ళ మీద తేలుతుంది
అది నిజమని
అప్పుడు నమ్ముతం..!
కన్నీటి సముద్రాలను కళ్ళల్లో దాచుకొని
ఈత రాక
ఈదలేక జీవితమంతా
జీవచ్చవాలమవుతం...
***
నిజం నిప్పులాంటిదే కావచ్చు
కాల్చి చూపించలేం కదా
చెబితే నమ్మాలి.
ఎదుటివారిమీద నమ్మకముండలి
చెప్పేవారి మీద గురి కుదరాలి
మనం రాళ్ళను నమ్మినంతగా
మనుషుల్ని నమ్మం.
మనిషినే నమ్మాలి
వెయ్యిసార్లు ఓడిపోయినా సరే
మానవున్నే నమ్మించాలి.
Login to add a comment
Subscribe to latest comments
