-
-
నాడీ జ్యౌతిషము అను గోచారప్రభ
Nadi Jyoutishamu Anu Gocharaprabha
Author: P M Gopalachary
Publisher: Self Published on Kinige
Pages: 276Language: Telugu
నాడీజ్యోతిషము - గోచారప్రభ అనే ఈ గ్రంథం గోచారరీత్యా వివిధగ్రహాల నాడీగమనకాలంలో, జన్మజాతకంలోని ఇతరగ్రహాలతో సమాగమమైనపుడు, ఎలాంటి ఫలితాలనిస్తాయనే విషయాన్ని విపులంగా చర్చించి ఉన్నాను. జాతక పరిశీలనలో గోచారానికి అత్యంతం ప్రాధాన్యత కలదు. ఏ వ్యక్తి జాతకంలో నైనా ఒక సంఘటన జరిగేదీ లేనిదీ ఎప్పుడు జరిగేదీ తెలుసుకోవడానికి దశలు గోచారం తోడ్పడతాయి. ఫలిత నిర్ణయం జాతకంపై 20 శాతము, దశలపై 30 శాతం, గోచారంపై 50 శాతం ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా గోచార పరిశీలన జన్మరాశి ఆధారంగా చేయడం జరుగుతుంది. జననకాలంలో చంద్రుడున్నరాశి జన్మరాశి అవుతుంది. దానిని మొదటిభావంగా తలచి దానినుండి ఏ ఏ రాశులలో ఏ ఏ గ్రహం చోటు చేసుకొందో చూచుకొని గోచారఫలితం చెప్పడం సాధారణంగా జరుగుతుంది. ఫలితాలు ఆ రాశిలో జన్మించిన వారందరి ఒకే విధంగా కాన వస్తుంది. అనుభవంలో అందరికీ ఒకే విధంగా ఉండదు. కాని ఈ గ్రంథంలో ఆ యా గ్రహాలు జన్మజాతకంలోని ఇతరగ్రహాలతో సమాగమమైనపుడు ఏ ఏ ఫలితాలనిస్తాయో వివరించి ఉన్నాను.
అష్టకవర్గరీత్యా గోచారఫలం ఎలా చెప్పవచ్చో సంగ్రహంగా తెల్పి ఉన్నాను. సాధారణ గోచారఫలితాలు, అష్టకవర్గ గోచారఫలితాలు వీటిని వేరే గ్రంథాలలో చూచుకొనవచ్చు.
నాడీ జ్యోతిషవిధానంలో గురువు మొదలైన అన్ని గ్రహాలు ఒక రాశిలోనికి ప్రవేశించి గమించి, తర్వాతి రాశిలోనికి వెళ్ళే సమయాన్ని గుర్తించి, ఆ కాలంలో మొత్తం రాశిచక్రంలో వాటి ఊహాగమనాన్ని గణించి, అప్పుడు అవి ఇవ్వ గల్గిన ఫలితాలు ఎలా ఉంటాయో పలు ఉదాహరణలతో నిరూపించడం అయినది. ఈ విధానం ఆధారంగా ఎఫిమరీస్ లో గ్రహస్థితిని చూచి ఉంచుకొని, ఒక వ్యక్తియొక్క జాతకంలో, భవిష్యత్తులో, ఒక నిర్ణీతకాలంలో నాడీగ్రహగమనాన్ని, ఆ జాతకంలోని ఇతర గ్రహాలకలయికను పరిశీలించి అనుభూతిలోనికి రాగల శుభ అశుభ ఫలితాలను ఖచ్చితంగా నిర్ణయింపవచ్చు.
ఆపైన అంగగోచారం అనే దానిని కూడ ఇందు పొందుపరిచి ఉన్నాను. ఒక్కొక్క నక్షత్రంపై విభిన్న గ్రహాలు చరించే సమయంలో ఎలాంటి ఫలితాలు అనుభూతిలోనికి వచ్చేది ఇచ్చట నిరూపితమై ఉన్నది. ప్రత్యేకంగా 27 నక్షత్రాలకు వేర్వేరుగా పట్టిక ఇచ్చి ఉన్నాను.
- పి.యం. గోపాలాచారి
గమనిక: "నాడీజ్యౌతిషము అను గోచారప్రభ" ఈబుక్ సైజు 5.5 mb
