-
-
నాది దుఃఖంలేని దేశం
Nadi Dukham Leni Desam
Author: Vadrevu China Veera Bhadrudu
Publisher: Dr. P. Vijayasree
Pages: 208Language: Telugu
భారతీయ సాహిత్య చరిత్రలో కబీరు ఒక విశిష్ట సంఘటన అంటుంది ఎవిలిన్ అండర్ హిల్. గత అయిదువందల ఏళ్ళుగా కబీరు ఉత్తరభారతదేశాన్నంతటినీ గాఢంగా ప్రభావితం చేస్తూ వచ్చాడు. గురునానక్, రైదాసు, దాదూ, బుల్లేషా వంటి సంత్ కవులకే కాక, ఆధునిక భారతదేశంలో కూడా రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా వంటి ముక్తపురుషులకు, రవీంద్రనాథ్ టాగోర్ వంటి విశ్వకవికీ, మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి సామాజిక దార్శనికులకు కూడా స్ఫూర్తిదాయకుడిగా ఉన్నాడు.
ప్రస్తుత భారతదేశాన్ని తిరిగి హిందూ మహ్మదీయ శిబిరాలుగా చీల్చడానికి విద్వేషకరశక్తులు ప్రయత్నిస్తున్న కాలంలో, సామాజిక సమగ్రతను కాపాడటానికి కబీరు నమ్మిన, ప్రకటించిన భావజాలానికి అపారమైన ప్రాసంగికత ఉంది. హిందూ, బౌద్ధ, జైన, మహ్మదీయ, శాక్తేయ మతధర్మాలకు అతీతంగా సాగిన ఆత్మప్రయాణం ఆయనది. సగుణభక్తిలోని భావోద్వేగాన్నీ, విరహావేదననూ, హృదయసౌకుమార్యాన్నీ ఆయన నిర్గుణధారలో మిళితం చేసాడు. తన జీవితాన్ని ఆనందమయం చేసిన సత్యస్వరూపుణ్ణి, ఆయన ఏదో ఒక మతానికి చెందిన విగ్రహంగాకాక, అత్యంత సన్నిహితుడైన, ఆత్మీయుడైన సహచరుడిగా మనకు పరిచయంచేస్తాడు.
వివిధసంప్రదాయాలకు చెందిన కబీరు సాహిత్యంలోని వివిధ రచనల నుండి 305 సాఖీ, శబద్, రమైనీలను ఏరి కూర్చి తెలుగులోకి అనువదించి వాడ్రేవు చినవీరభద్రుడు అందిస్తున్న సంకలనమిది. తన సాధనలో, సాక్షాత్కారంలో తన అనుభవాల్ని, అనుభూతినీ కబీరు ఎప్పటికప్పుడు తన శ్రోతలతో పంచుకుంటూ వచ్చినందువల్ల ఈ కవిత్వం చదవడం కబీరు ఆత్మకథను చదవడంలాంటి అనుభవం కూడా.

- FREE
- FREE
- FREE
- FREE
- ₹75
- FREE