• Nadheema
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నదీమ

    Nadheema

    Publisher: J.V.Publications

    Pages: 107
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేను 8వ తరగతి చదువుతున్న రోజులు. ఒక రోజు తెలుగు టీచర్ పిలిచారు. స్కూల్ మాగజీన్‌కి ఒక కవిత రాయమన్నారు. అంతవరకు కవిత, కథలాంటివి వ్రాసిందే లేదు. ఆలోచించాను ఏమి వ్రాయాలా అని. విచిత్రంగా ఒక నది, దానిలో ఒక పడవ, ఆ పడవలో ప్రయాణం జీవితంలా అనిపించాయి. అదే రాసాను. అచ్చయింది. అంతే ఆ తర్వాత రాసిందేమీ లేదు.. చదువులు, పై చదువులు, వైద్యవృత్తి, కుటుంబం, పని వత్తిడి వీటన్నింటిలో దశాబ్దాలు వెళ్ళిపోయాయి. ఈ మధ్యే అనుకోకుండా ఒకనాడు పరమశివుని ధ్యాసలో లోలోతుగా వెళ్ళిపోయిన ఆ క్షణం, ఏమి జరుగుతుందో నాకే తెలియనట్లుగా ఒక అందమైన కవిత ప్రవహించింది. అచేతనంగా నేను. నాలోని చైతన్యమే ఆ కవిత అయింది... ఇది జరిగి బహుశా 3 సంవత్సరాలయి ఉంటుంది.

క్రమక్రమంగా నాలోని భావాలకి కవిత రూపంలో స్పందించడం ఇప్పుడు సహజం అయిపోయింది. ఆ సదాశివుని ధ్యానం, ఆ అనంత సాగరుని చెలిమి, ఆ చల్లని సమీర సాంత్వన మనసుని పద్యమార్గాన నడిపించాయి. ఈ సృష్టి, ప్రకృతి, ఆ పరమశివుడు, సర్వం నిండిన అమితానంద పులకరింతలు, భావోద్వేగాలు, అలజడులు, ఉత్తేజాల పారవశ్యాలు ఈ కవితా సుమాలు. ఆ అద్భుత భావతరంగిణిలో నేను ఓలలాడాను. ఆ సాగరాన్ని మనోనేత్రంలో చూస్తూ ఉత్తేజం పొందాను. ఆ సమీరం తనదైన చల్లని స్పర్శతో ఇచ్చిన ఓదార్పులో మైమరచాను. నాలాగే మీరూ ఆస్వాదిస్తారని, అనుభూతి చెందుతారని, అన్వేషిస్తారని నా కోరిక.

- డా. శోభ వెన్నెం

నదీమ

కొండకోనలలో సాగిన ఓ నదీమా!
సజావుగా సాగెనా నీ పయనం?
సుదూర దూర తీరానికేగా
సాగుతుంది నీ ప్రయాణం?
ఎన్ని సుడులు ఎన్ని అలలు
దాచావు నీ గర్భమందు?
సజీవజీవనదై ప్రవహించి
అల్లంత దూరాన సాగరుని చూసి
అలుపు తీర్చుకోడానికా
చేష్టలుడిగి ఆగావు?
అలసిసొలసి మరువకుమీ
అల్లంత దూరాన నీ కోసం నీ సాగరం!!

Preview download free pdf of this Telugu book is available at Nadheema