-
-
నాద బ్రహ్మోపాసన
Nada Brahmopasana
Author: Madhusudhana Saraswati(Maitreya)
Publisher: Mohan Publications
Pages: 138Language: Telugu
ఒక గాయకుడు మధురమైన సంగీతాన్ని సృష్టించాలంటే అతడు జాగరూకుడై ఉండాలి. లయచూసుకోవాలి. శృతికలుపుకోవాలి, ప్రక్కవాయిద్యాలను సరిచేసుకోవాలి. ఇంకా ఇంకా.... వీటన్ని సమగ్ర స్వరూపంగా ఏర్పడిన నాద ప్రపంచంలో శ్రోత సులువుగా లీనమైపోతాడు, అస్థిత్వాన్ని మరచిపోతాడు. తనకు తానుగా సంగీతానికి ''శహభాష్'' అనడు. తనకు తెలియకుండానే నాదోపాసనలో తన్మయుడౌతాడు. నాదబింబకళాధరుడౌతాడు. ఆ నాద సాగరంలో తానొక బిందువౌతాడు.
నాదసాగరంలో అమ్మ హంస పీఠం మునిగిపోకుండ వీణకు సొరకాయ బుర్ర బిగించుకుందట. ఇక మానవుల విషయం చెప్పనే అక్కరలేదు. ఎటూ 'రాగ' సాగరంలో లీనమయే అనుభవం ఉన్నవారే కనుక తొందరగా కరిగిపోతారు. ఎటొచ్చీ మనసు ప్రధానం.
కనురెప్పల సవ్వడికి, చిగురాకులు తలలూపడానికీ కూడా కదలి కరగి కన్నీరు కురిపించే మనసుండాలిగాని....
అందుకే మా స్వామి సంగీత రసికుడు
ఆస్వాదన అనేది చిన్న విషయంకాదు
ఒక రాజుకు సంగీతమంటే ఇష్టం ''నా రాజ్యంలో వాళ్ళంతా సంగీతం వినాలి'' అని ఆజ్ఞ వేశాడు రాజు. చేసేదిలేక అందరూ సంగీత సభలకు హాజరై తెలిసినా తెలియక పోయినా తలలెగిరిపోతాయేమోననే భయంతో తలలూపడం మొదలుపెట్టారు. రాజు తన రాజ్యంలోని ప్రజలంతా సంగీతరసికులని సంతోషించాడు. కాని మంత్రి అందుకు అంగీకరించలేదు. నిజమైన సంగీత రసికుడెవరో ఋజువు చేస్తానని చెప్పి ప్రజలందరినీ మంచి సంగీత సభకు పిలిపించి ''ఎవరు తల ఊపినా తల తీస్తాను'' అన్నాడు అంతే! అన్ని తలలు ఆగిపోయాయి. కాని నిజమైన సంగీత రసికుడి తలమాత్రం ఊగుతూనే ఉంది. తల ఎగిరిపోతుందేమోననే భయం కూడా వాడి తల ఊగకుండా ఆపలేకపోయింది. అలాంటిది సంగీతరసికత అది అనుభవించారు శ్రీ స్వామిజీ.
- సరస్వతీపుత్ర భూసురపల్లి వెంకటేశ్వర్లు

- ₹106.92
- ₹87.6
- ₹87.6
- ₹87.6
- ₹60
- ₹60
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE