-
-
నాన్నా!! తొందరగా వచ్చేయ్ - రివైజ్డ్
Naannaa Tondaragaa Vacchey Revised
Author: Kolluri Soma Sankar
Publisher: Self Published on Kinige
Pages: 66Language: Telugu
Description
ఇద్దరినీ ఒకరిని ఒకరు నిందించే హక్కు లేదు. అయినా నోరు ఊరుకోదు. అనవసరమైన విషయాలన్నింటినీ పట్టించుకుంటుంది. కొత్త గాయాలను చేస్తుంది. పాత గాయాలను తిరిగి రేపుతుంది. ఆ గాయాలు మానేవరకు మా మధ్య నిశ్శబ్దం కొనసాగుతుంది. ఒకటి రెండు రోజుల పాటు ఇద్దరం మాట్లాడుకోం.
- (అమృతవర్షిణి కథ నుంచి ....)
"నిజానికి పాప పుట్టినప్పుడు నేను దాదాపుగా ఏడ్చినంత పని చేసాను. 'అయ్యో, భగవంతుడా, నేనేం పాపం చేసాను? నాకు ఆడపిల్లనిచ్చావు?' అంటూ దేవుడిని నిలదీసాను. నా మిత్రులంతా నాపై తెగ జాలి చూపించారు. 'పాపం నంద కిషోర్' అనేవాళ్ళు. నా స్థానంలో వాళ్ళని ఊహించుకోడానికి కూడ ఇష్టపడలేదు. మా వాళ్ళంతా అంటారు - ఆడపిల్ల శాపం, పరాయి సొత్తు అని! కాని మా విషయంలో అది తప్పయింది. మా పాప మాకు వరం సార్'' చెప్పాడు నంద కిషోర్.- (వాళ్ళిద్దరూ, ఆటో డ్రైవరు కథ నుంచి....)
హఠాత్తుగా అమిత్కి సాయంత్రం తను దేవుడిని కోరిన కోరిక గుర్తొచ్చింది. 'నేను నాన్న రావడం కాస్త ఆలస్యం అవ్వాలని మాత్రమే కోరుకున్నాను. అంతే. కొద్ది నిముషాలు మాత్రమే ఆలస్యం కావాలని కోరుకున్నాను. గంటల కొద్ది కాదు కదా! ఒక వేళ నాన్నకి ఏమీ కాలేదు కదా? ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా? ఏదైనా ఇబ్బందా? లేదంటే ఒక గంట పట్టే ప్రయాణానికి మూడుగంటల పైన ఎందుకు పడుతుంది?....' ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అమిత్ చిన్ని బుర్రని వేధించాయి.- (నాన్నా!! తొందరగా వచ్చేయ్ కథ నుంచి......)
ఆ పసి బుగ్గలపై కారుతున్న కన్నీళ్ళని తుడిచాను. విషాదం నిండిన కళ్ళతో, విరామం లేకుండా తన కథని చెబుతోంది. నేను మౌనంగా వింటూ అర్థం చేసుకుంటున్నాను. కళ్ళకి ప్రత్యేకించి ఎటువంటి భాష ఉండదు. అన్ని భాషలు కళ్ళల్లో వ్యక్తమవుతాయి. తన పట్ల జరిగిన వాటిని, ఇతరుల పట్ల జరిగాయని తను విన్న వాటిని ఆ పాప కళ్ళు చెప్పేశాయి. మెల్లిమెల్లిగా అలసిపోయి, నా గుండెల మీద వాలి నిద్రలోకి జారుకుంది, ఓదార్పు పొందినట్లుగా. మరి నా సాంత్వన సంగతేమిటి? దానిని ఎవరు పట్టించుకుంటారు?- (అమ్రికావాలా కథ నుంచి......)
"నీకు ఆటిజం అంటే ఏంటో తెలుసా? పోనీ మీ అమ్మకి తెలుసా?'' ఆ ముసలావిడ ఇంగ్లీషులో గడగడా మాట్లాడుతోంది. "మీ అమ్మకి కూడా తెలియకపోతే, నేను చెబుతా విను. ఆటిజం అనేది జన్యుపరంగా కలిగే ఓ లోపం, దాని వలన కొంత మంది పిల్లలు మిగతావారితో పోలిస్తే కాస్త విభిన్నంగా ఉంటారు. మా పాప ఆటిస్టిక్.. అంతే కాని పిచ్చిది కాదు. ఓ స్పెషల్ స్కూల్లో చదువుకుంటోంది, రాయడం చదవడం వచ్చు. బొమ్మలు వేస్తుంది. కాకపోతే, గొడవలు, రక్తం చూసినప్పుడు భయపడుతుంది. దానికి మనం చేయలేం. ఏమైనా చేయగలమా చెప్పు?''- (బుద్ధిమాంద్యం కథ నుంచి......)
Preview download free pdf of this Telugu book is available at Naannaa Tondaragaa Vacchey Revised
Login to add a comment
Subscribe to latest comments
