-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
నాలో... (free)
Naalo - free
Author: Manasri
Publisher: Self Published on Kinige
Pages: 44Language: Telugu
మృదు మధురమైన రమ్యమైన భాషా సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం అరుదైపోయిన నేటి సాహితీవనంలో మనాశ్రీ ఒక స్వాతి జల్లులాంటి కవి. తన సృజనతోను, భాష పై తనకున్న మక్కువతో రంగరించి తట్టిలేపి లోకాన్ని చూపితే, స్పందన తప్పకుండా వుంటుందనే ఆశాభావం, అణువణువునా కన్పరిచే ఒక మంచి కవి మనాశ్రీ. మనందరి సిరి అనదగ్గ మనాశ్రీ.
- కె. యస్. ఆర్. జగదీష్
* * *
మనాశ్రీ కవిత్వం కేవలం సమాజంలోని లోపాలను ఎత్తిచూపడానికి మాత్రమే పరిమితం కాలేదు. 'షడ్రుచుల సమ్మేళనం' లాంటి కవితల్లో ఆహ్లాదకరమైన భావుకత కూడా కనిపిస్తుంది. ప్రతి కవితలో ఏదో ఒక మెరుపు కనిపిస్తూనే ఉంటుంది.
- రాయప్రోలు వెంకటకామేశ్వరశర్మ
* * *
మన అంతరంగం, మన సంస్కృతి, మనం రోజూ చూసే ప్రపంచాన్ని మన ముందుంచాలన్న కనీస ప్రయత్నం 'మనాశ్రీ'ది. మనలోని ఆశల్నీ, ఆవేశాల్ని, ఉద్రేకాల్ని, ఉత్పాతాల్నీ, ఉప్పెనల్నీ, కష్టాలనీ, కన్నీళ్ళనీ తాను అనుభవించి వాటి శక్తిని అక్షరాల్లో నింపుకొన్నాడు. తనది మానవతా కవిత్వం, ఇది జీవితంలోని అన్ని వంకర సన్నివేశాల్నీ ఖండించింది, మనిషిలోని మానవత్వాన్ని ప్రశ్నించే అన్ని మార్పుల్నీ నిర్దాక్షిణ్యంగా తెగ నరికింది. తాను ఫీలయ్యే ప్రతి విషయాన్నీ కవితీకరించాడు. మనిషిలోని ఉండకూడని ప్రతి లక్షణాన్నీ తన కవితల్లో నిక్షిప్తం చేసి ఆ నిధిని నవీన సమాజం అభ్యున్నతికి ఉపయోగపడాలని, తాను గంజి తాగైనా మనకు పంచభక్ష్య పరమాన్నాలని వడ్డిస్తున్నాడు.
- కైలా విజయమోహన్కుమార్

- FREE
- FREE