-
-
నా స్మృతిలో చేగువేరా
Naa Smruthilo Cheguvera
Author: Fidel Castro
Pages: 160Language: Telugu
ప్రథమ సోషలిస్టు రాజ్య స్థాపనకు దారితీసిన అక్టోబరు విప్లవంతో గాని, ప్రపంచపు రూపురేఖలు మారడానికి దోహదపడిన చైనా విప్లవంతో గాని ఆయనకు ప్రత్యక్షంగా సంబంధం లేదు. కాని ఆయన పేరు విశ్వవ్యాపితంగా విప్లవం అన్న మాటకు ప్రతీకగా ప్రేరణగా నిలబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే విప్లవం అన్న మాట వినపడగానే ఆయన స్పురద్రూపం కళ్ళలో కదలాడుతుంది. కదిలిస్తుంది. ఆయనే ఎర్నెస్టో చే గువేరా. జాషువా అన్న విశ్వనరుడూ, మార్క్స్ వూహించిన శ్రామికవర్గ అంతర్జాతీయ విప్లవకారుడూ ఆయన. సామ్రాజ్యవాదానికి సింహస్వప్నం, స్వచ్ఛమైన సామ్యవాద వ్యక్తిత్వానికి సజీవ తార్కాణం ఆయన.
ఈ పుస్తకం చే జీవితాన్ని, పోరాటాన్ని, వీర మరణాన్ని, అనంతర పరిణామాలను కళ్ళకు కట్టినట్టు చిత్రించే అపురూప గ్రంథం. దీన్ని మనకు అందించింది కూడా ఎవరో కాదు - నాయకుడుగా, సహచరుడుగా చే ను నడిపించి లాటిన్ అమెరికాలో అరుణతార వెలిగించిన ఫైడల్ కాస్ట్రో. చే విశిష్ట జీవితం లాగే వీరమరణం కూడ ప్రపంచ సంచలనమై అనేక కథలూ, కట్టుకథలకు దారితీసినపుడు కఠోర సత్యాలను వెల్లిచేస్తూ కాస్ట్రో చేసిన ప్రసంగాలు, రచనలు, ఇంటర్వూల సంకలనం ఇది.
* * *
చేగువేరా ఒక్కసారిగా అదృశ్యమైనప్పుడు దానిపై రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. తొలిదశలో అతని క్షేమం దృష్ట్యా క్యూబా మౌనం పాటించింది. చివరకు 1967లో అతను హత్య గావించబడ్డాడని నిర్థారించుకున్న తరువాతనే కాస్ట్రో అందుకు సంబంధించిన పూర్తి వాస్తవాలు బయటపెట్టాడు. వాటిలోనే ఆయన చే వ్యక్తిత్వ విశిష్టతకు నివాళులర్పించారు. అదే సమయంలో గెరిల్లా యుద్ధంలో చే అనుసరించిన పద్ధతుల్లో కొన్ని లోపాలను చూపడానికి కూడా కాస్ట్రో సంకోచించలేదు. వాటిని, తరువాత వివిధ దశల్లో చే గురించి చేసిన ప్రసంగాలను కలిపి ఈ పుస్తకం రూపొందింది.
- ప్రచురణ కర్తలు
