• Naa Mate Tupaki Tuta
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా మాటే తూపాకి తూటా

    Naa Mate Tupaki Tuta

    Author:

    Pages: 133
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్వాతంత్ర్యోద్యమం యువతను ఉర్రూతలూగిస్తున్న కాలానికి చెందిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. అటు స్వాతంత్ర్యోద్యమంలో, ఇటు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొంటూ ఆమె తన అనుభవాలను వివరిస్తుంటే వినడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆమె మాటతీరు, వ్యవహార శైలి మూస పద్ధతికి భిన్నంగా, చాలా విలక్షణంగా వుంటాయి. ఇలాంటి వ్యక్తులు శతాబ్దానికి ఏ ఒక్కరో వుంటారు. మల్లు స్వరాజ్యం రెండు శతాబ్దాలను ప్రభావితం చేసిన మహా యోధురాలు.

- వసంత కన్నబిరాన్

మల్లు స్వరాజ్యం గారి జీవితమంటే 20వ శతాబ్దపు తెలంగాణా సామాజిక రాజకీయ చరిత్ర. అణచివేతను సహించలేని ప్రజల సామూహిక తిరుగుబాటు చరిత్ర. పీడితుల పట్ల సహానుభూతితో పిడికిలి బిగించి పోరాడిన ఒక తరం చరిత్ర. మన జీవితాలకు సంబంధించిన నిర్ణయాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవటమెలాగో నేర్పే గొప్ప పాఠం ఆమె తొలినాళ్ల జీవితం.

- ఓల్గా

మల్లు స్వరాజ్యం తన పదకొండేళ్ల వయసులో ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. ఆనాడు తనలో ఏ నిప్పు రవ్వ రాజుకుందో ఇవాళ 86 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆ జ్వాల అలాగే ఎగిసిపడుతూ వుంది. ఈ రోజు కూడా ఆమె ఎంతో స్పష్టతతో, ఆలోచనాత్మకంగా మాట్లాడుతూ, పోరాడుతూ ఎందరో మహిళలకు స్ఫూర్తినిస్తున్నారు. “నా గొంతే నాకు తుపాకి, తూటా” అంటారామె. ఆమె జీవితం ఒక మార్క్సిస్టు వీరోచిత పోరాట గాథ.

- శాంత సిన్హా

Preview download free pdf of this Telugu book is available at Naa Mate Tupaki Tuta