-
-
నా జీవన నౌక
Naa Jeevana Nauka
Author: Gottipati Brahmaiah
Publisher: Self Published on Kinige
Pages: 443Language: Telugu
కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో జన్మించిన శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారు తొలి శాసనమండలి చైర్మన్‌గా పని చేశారు.ఆత్మ స్తుతి, పరనింద లేని ఏకైక జీవితచరిత్రగా ఈ పుస్తకం అభిమానుల్ని అలరిస్తుంది.
తన జీవితంలో చేస్తూ వచ్చినట్లే తన జీవిత చరిత్ర రచనలో సైతం ఆ మంచిని చూడటానికే ప్రయత్నించారు అని నార్ల వెంకటేశ్వరరావు గారు కించిత్తు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఎవరి మీద ఒక్క ఆరోపణ కూడా లేకుండా తన జీవిత చరిత్రని రాసుకున్న వ్యక్తిగా గొట్టిపాటి బ్రహ్మయ్య గారు చరిత్రలో నిలిచిపోతారు.1898 నుంచి 1984 వరకు 86 ఏళ్ళు బ్రతికి, అందులో ఎక్కువ భాగం క్రియాశీల రాజకీయాల్లో తలమునకలుగా బ్రతికిన వ్యక్తికి సహజంగానే పరిచయాలు మెండు. వాళ్ళందరి గురించి తనకు తెల్సిన మంచి విషయాలు మాత్రమే రాయటం బహుశా ఆయనకొక్కరికే సాధ్యమైన పనేమో.
* * *
బ్రహ్మయ్యగారి స్వీయచరిత్రలో వారి స్వంతచరిత్ర మాత్రమే కాక ఇతర్ల చరిత్రలెన్నో వున్నాయి. ఒక వ్యక్తులను గురించేకాదు, వస్తువులను గురించి, దేశాన్ని గురించి, కాలాన్ని గురించి, అవసరాలను గురించి, పరిసరాలను గురించి, మంచిని గురించి, చెడును గురించి, పట్టణాలను గురించి, పల్లెలను గురించి, ఈ విధంగా ఎన్నో.
జన్మించిన ప్రతీవ్యక్తి గొప్పవారు కాలేరు. గొప్పవారైన వారంతా మంచివారు కాలేరు. గొప్పతనమూ, మంచితనమూ ఒకే వ్యక్తిలో యిమిడినప్పుడు ఆ వ్యక్తులు గొప్ప మంచివారయేది. మంచి గొప్పవారయేది. ఈ సత్యాన్నే చాటుతుంది బ్రహ్మయ్యగారి స్వీయచరిత్ర.
- సంజీవ్‌దేవ్
