-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
నా చంపారన్ యాత్ర (free)
Naa Champaran Yatra - free
Author: Vadrevu China Veera Bhadrudu
Pages: 58Language: Telugu
నేను చదివిన పుస్తకాలన్నిటికన్నా విలువైన పుస్తకం బీహార్ ప్రభుత్వం ప్రచురించిన Select Documents on Mahatma Gandhi’s Movement in Champaran 1917-18 (1963). ఈ పుస్తకం గాంధీ పోరాటానికి సంబంధించిన చారిత్రిక పత్రాల సంకలనం. ఆ పత్రాలు బ్రిటిషు ఉద్యోగులు, జిల్లా మేజిస్ట్రేటు మొదలుకుని వైస్ రాయిదాకా రాసుకున్న ఉత్తరాలు, నివేదికలు, పోలీసు రిపోర్టులు, కాన్ఫిడెన్షియల్ పత్రాలు-అన్నీను. అందులో కాగితాల్ని గాంధీ, రాజేంద్ర ప్రసాద్ కూడా చదివి ఉండరు. 600 పేజీల ఆ పుస్తకాన్ని నేను ఆమూలాగ్రం చదివాను. అ చారిత్రిక పత్రాలన్నీ చదివినతర్వాత, చంపారన్ లాంటి పోరాటం ప్రపంచ చరిత్రలోనే మరెక్కడా సంభవించలేదని అర్థమయింది. ఒక అరెస్టు లేకుండా, ఒక బుల్లెట్టు పేలకుండా, ఒక రూపాయి చందా దండకుండా, ఏదో ఒక పత్రికని ప్రచారం కోసం ఆశ్రయించకుండా చేపట్టిన పోరాటం అది. ఎంతో ఆత్మక్రమశిక్షణ ఉండే మనిషి గాని చంపారన్ సత్యాగ్రహం వంటి పోరాటం చేపట్టలేడు.
ఆ పోరాటంలో భాగంగా, రైతు సమస్యలు తెలుసుకోడానికి, ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ని నియమించడానికి నిర్ణయించాక, “ఇప్పుడు నీ పని పూర్తయింది కదా, చంపారన్‌తో నీకు ఇంకేం పని?' అని లెఫ్టినెంట్ గవర్నరు అడిగినప్పుడు, గాంధీ, తన అసలు పోరాటం అప్పుడే మొదలవుతుందని, 'శిక్ష, స్వచ్ఛత, స్వాస్థ్య' (విద్య, పరిశుభ్రత, ఆరోగ్యం) ధ్యేయాలుగా చంపారన్ని పునర్నిర్మిస్తానని జవాబిచ్చాడు. ఆ ప్రకారమే మూడు పాఠశాలలు తెరిచాడు. వాటితో పాటు ఆరోగ్యవిద్య కోసం సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ కార్యకర్తల్ని రంగంలోకి దింపాడు. ఇక పారిశుద్ధ్యం గురించి పనిచేయడానికి తన భార్యనే అభ్యర్థించాడు. ఒక వైపు రాజకీయపోరాటం చేస్తూ, మరొకవైపు అంతే త్యాగనిరతితో, గ్రామీణ పునర్నిర్మాణాన్ని చేపట్టగలిగే ఇటువంటి ఉదాహరణల కోసమే నేను వెయ్యికళ్ళతో వెతుక్కునేది.
ఆ పుస్తకం చదివాక, నాకు చంపారన్ చూడాలనిపించింది. ఆ ప్రాంతాలు తిరిగి, వందేళ్ళ తరువాత, ఆ సమాజం ఎలా ఉంది, అక్కడ గాంధీ ప్రభావమేదన్నా ఇంకా మిగిలి ఉందా చూడాలని అనిపించింది.
అందుకని, చంపారన్‌లో నాలుగు రోజులు పర్యటించారు. గాంధీజీ నివసించిన స్థలాలు, దర్శించిన కొన్ని గ్రామాలు చూసాను. స్థానికులతో మాట్లాడేను. గ్రామస్థులతో మాట్లాడేను. నేను చదివినదాన్ని చూసినదాన్ని బట్టి చంపారన్ గురించి త్వరలో ఒక రచన వెలువరించాలి అనుకుంటున్నాను. ఈ లోపు నా చంపారన్ యాత్రానుభవాల ముచ్చట్లు కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
- వాడ్రేవు చినవీరభద్రుడు

- FREE
- FREE
- FREE
- FREE
- ₹75
- FREE