-
-
న'మో'
NaMO
Author: Multiple Authors
Pages: 286Language: Telugu
ప్రముఖ కవి వేగుంట మోహన ప్రసాద్ స్మృతికి రచయితలు, కవులు, విమర్శకులు, వార్తాపత్రికలు, కుటుంబ సభ్యులు అందించిన నివాళి ఈ పుస్తకం. ఖాదర్ మోహియుద్దీన్, శ్రీశ్రీ విశ్వేశ్వర రావు సంపాదకీయం వహించారు.
* * *
అభివ్యక్తికి ఆస్కారం లేని అనేక జీవిత సత్యాల్ని ఆవిష్కరించిన అరుదయిన కవి మో.
సనాతన అనుభూతులతో ఆధునిక సౌందర్య చేతనని ప్రకోపింపజేసిన 'మో' వాస్తవానికి ఒక జానపద వాగ్గేయకారుడు. ఆధునిక ఆదివాసి. ఆయన అక్షరాలు అల్లావుద్దీన్ అద్భుతదీపాలు. మాటలు మాయలాంతర్లు.
మానవుని ఆదిమ అవసరాల చుట్టూ పరిభ్రమిస్తుంది ఆయన కవిత్వం. తన మార్గం అనితరసాధ్యం అన్నాడు శ్రీశ్రీ. కానీ ఆయన తర్వాతి కవులందరూ అదే మార్గాన్ని యధేచ్ఛగా అనుసరించారు. మోహన ప్రసాద్ అసలు ఏనాడు అటువంటి ప్రకటన చేసి ఎరుగడు. కానీ ఆయన అనుసరించిన మార్గం యిప్పటికీ అనితరసాధ్యంగానే మిగిలి వుంది.
కవిత్వానికి సంబంధించిన ప్రతీయుగం, ప్రతీ తరం తనదయిన ఒక సందర్భ గ్రంథం కోసం అన్వేషిస్తుంది. యువతరానికి 'మో' ఒక అనివార్యమయిన సందర్భంగా అవతరిస్తున్న సమయంలో ఆయన ఆకస్మిక మరణం ఒక అనూహ్యమైన విషాదం.
'మో' విడిచివెళ్ళిన వెల్తిని బహదూర్షా జఫర్ పదాలతో బాధగా ఆలపిస్తున్నారు ఎవరో......
జిందగీమే దోహి లమ్హే ముఘ్సే గుజరే హయ్ కఠిన్
ఎక్ తెరే అనేసె పహెలే ఎక్ తేరే జానేకె బాద్
- ఖాదర్ మోహియుద్దీన్, శ్రీశ్రీ విశ్వేశ్వర రావు

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE