• Na Sampadakeeyalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా సంపాదకీయాలు

    Na Sampadakeeyalu

    Pages: 91
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పత్రికలకు సంపాదకీయాలు ఎంతో అవసరం. పత్రిక అభిప్రాయాన్ని విస్పష్టంగా వెల్లడించేందుకు సంపాదకీయాన్ని మించిన సాధనం లేదు. ఇది వ్యాఖ్యాకేంద్రం. అయితే సంపాదకీయాల ప్రాముఖ్యతలు ప్రాధాన్యతలలో పత్రికకు - పత్రికకూ మధ్య తారతమ్యాలు ఉంటాయి. దిన పత్రికల్లో సంపాదకీయాలకు చాలా ప్రత్యేకస్థానం ఉంటుందనే సత్యం తెలిసిందే. దిన పత్రికా సంపాదకీయాలు సమాజ ఆలోచనల్ని మార్చగలిగిన సందర్భాలున్నాయి. గతంలో తెలుగువారు రాజకీయ దిశా దర్శనం కోసం నార్ల వెంకటేశ్వరరావు, గోరాశాస్త్రి వంటి సంపాదకుల సంపాదకీయాలపై ఆధారపడే వారని చెబుతారు. దిన పత్రికల సంపాదకీయాలకు ''సమకాలీన విలువ'' మాత్రమే ఉంటుంది. నిన్నటి సంపాదకీయం నేటికి తన ప్రాసంగికత (రిలవెన్స్‌)ను కోల్పోవడం సహజమే. దిన పత్రికా సంపాదకీయాల్లో వ్యంగ్యం, నిశితవ్యాఖ్యా గుంఫనం, కొంతవరకు దూకుడుతో కూడిన వాక్య విన్యాసం అవసరమేనని చెబుతారు. వార పత్రికల్లో సంపాదకీయాల ప్రాధాన్యత నామమాత్రమే. ఈ తీరు ఆంగ్ల మేగజైన్‌ జర్నలిజం లోనూ కనబడుతుంది. అయితే మాస పత్రికల సంపాదకీయాలకు మాత్రం సమకాలీనత కంటే శాశ్వతత్వం ఎక్కువ. ప్రధానంగా, సాహిత్య మాస పత్రికల సంపాదకీయాలలో సునిశితమైన సూత్రీకరణ దృష్టి, సుస్థిరమైన దృక్పథాన్ని పెంపొందించగలిగే నేర్పు ఉండాలి. సంయమన వైఖరి అనివార్యమైన ఆవశ్యకత. ఈ మంచి లక్షణాలన్నీ కొండలరావుగారి జయంతి సంపాదకీయాలో ఉన్నాయి.

తెలుగులో కొక్కొండ వెంకటరత్నం పంతులు సంపాదకీయ రచనకు అంకురార్పణ చేస్తే నార్ల, గోరాశాస్త్రి, ప్రతాపరెడ్డి, నండూరి రామమోహనరావు వంటి వారు కొత్త దారులు వేశారు. దిన పత్రిక సంపాదకీయ రచయితలు వీరు వేసిన దారివెంట కొంత దూరమైనా నడవవలసిందే. ఈ మేరకు దిన పత్రికా సంపాదకీయాలకు మార్గదర్శకులున్నారు, వారు రాసిన మార్గదర్శినుల వంటి సంపాదకీయ సంపుటాలూ ఉన్నాయి. మాసపత్రికల విషయంలో ఇంతవరకు అటువంటి మార్గదర్శినుల స్థాయి సంపాదకీయ సంపుటాలు (ఒకటి రెండు మినహా) వచ్చినట్లు లేదు. కొండలరావుగారి సంపాదకీయ సంపుటి ఈ లోటును తీర్చుతుంది. ఒక మాసపత్రిక సంపాదకీయ రచనలో ఉండవలసిన శాశ్వతత్వ స్పృహ, సంయమనం, హుందాతనంతో కూడిన భాష, సున్నితత్వంతో కూడిన అభివ్యక్తి, స్పష్టత, ప్రామాణికతలు ఎట్లా ఉండాలో కొండలరావుగారి సంపాదకీయాలు చెబుతాయి. సంచికా సంపాదకీయాలకు మంచి నమూనాలు కొండలరావుగారి సంపాదకీయాలు.

- ఆచార్య గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Na Sampadakeeyalu