• Na Sahitya Vyasalu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • నా సాహిత్య వ్యాసాలు

  Na Sahitya Vyasalu

  Pages: 246
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

త్రిభాషా కోవిదులైన వెలిచాల కొండలరావు గారి కలం నుంచి తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషా కవితలే కాక, పలు అనుసృజన కావ్యాలు కూడా వెలువడ్డాయి. సృజనాత్మక సాహిత్యంతో పాటు, వివేచనాత్మక వచన రచనలో కూడా ఆయన 'తనదైన' ప్రత్యేకతను ప్రదర్శించారు. ఆయా సందర్భాలలో వెలువడిన వ్యాసాలు, సంపాదకీయాలే అందుకు నిదర్శనాలు. విషయాన్ని 'లోచూపు'తో అధ్యయనం చేసి, అన్ని కోణాలనుంచి విశ్లేషించి విశదీకరించటంలో ఆయన విలక్షణ దృక్పథం ద్యోతకమవుతుంది. దేని గురించైనా ఒకరు చెప్పినది చెప్పకుండా - కొత్తగా ఆలోచించి - తన భావాలను పాఠకులకు అందించాలన్న స్పృహ, తపన ఆయన రచనల్లో అడుగుగునా తొంగి చూస్తుంది. భాష గురించి కాని, సాహిత్యం గురించి కాని, రచయితలు - వారి రచనల గురించికాని ఆయన అభిప్రాయాలు నవం నవంగా ఉండి పాఠకులను ఆలోచింపజేస్తూ - వారిలో జిజ్ఞాసను రేకెత్తిస్తాయి. దీన్ని నిరూపించటానికి ఎన్ని ఉదాహరణలైనా చూపవచ్చు.

'కవిసమ్రాట్‌' విశ్వనాథ సత్యనారాయణ అన్నా, 'యుగకవి' గుంటూరు శేషేంద్రశర్మ అన్నా కొండలరావుగారికి కొండంత అభిమానం. అయితే ఆ అభిమాన ప్రవాహంలో కొట్టుకుపోకుండ - వారి రచనల్లోని గొప్ప భావాలను, సాహితీ విలువలను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఎత్తి చూపుతారు. అంతర్వీక్షణంతో వారి అంతరంగాలను ఆవిష్కరింపజేస్తారు. శేషేంద్ర, విశ్వనాథలపై వివిధ సందర్భాలలో వెల్చాల రచించిన వివేచనాత్మక వ్యాసాలు ఒక రచయితను ఎలా అధ్యయనం చేయాలో సూచించే ''బాల (ప్రౌఢ) వ్యాకరణాలు'' అంటే అత్యుక్తి కాదు.

''కవిత్వం రాయదలుచుకున్నవారు విశ్వనాథను, శేషేంద్రను క్షుణ్ణంగా, జాగ్రత్తగా చదవాలి. వారి ఇతర భావాలతో మనం ఏకీభవించకపోతే ఏకీభవించకపోవచ్చు. కాని వారి సాహిత్య భావాలను మాత్రం మనం కాదనలేం కనుక, వాటిని గౌరవించాలి, గుర్తించాలి, పాటించాలి'' అన్న వాక్యాలు కొండలరావుగారి సహృదయతకు, నిష్పాక్షికతకు తార్కాణాలు.

''ఆధునిక నాగరికత ప్రధానంగా ఆడంబరానికి, అదుపులేని తనానికి, పొదుపు లేని తనానికి, మితిలేని తనానికి చెందింది. వాటి వలన సహనమూ, సర్దుబాటు కన్నాఎక్కువ తెలిసీ తెలియని స్వేచ్ఛాభావాలు, స్వతంత్ర భావాలు విస్తృతంగా వ్యాపిస్తాయి'' అని గుర్తించిన నేటి కుహనా నాగరికతపై స్పష్టమైన అవగాహన కలిగిన మేధావి వెల్చాల కొండలరావు గారు. అందుకే ''రచయితకు 'యోగి' లాంటి దృష్టుండలి. యోగి అనగా నిచట ముని, తపస్వియని కాదు, అర్థం. మనో మాలిన్యత, భావమూరేత లేకుండా - విషయాన్ని విశాలమైన దృష్టితో, విలీనతతో, వ్యక్తి అహంకార నిర్మూలితమైన చింతనా దృష్టితో చూడగలిగిన వాడని యర్థం'' అని నిశ్చితంగా, నిర్దిష్టంగా 'రచయిత'ను నిర్వచించారు. ఆయన వ్యాస వాహినిని 'లోతు'గా పరిశీలిస్తే ఇలాంటి భావాల 'మణులు' ఎన్నయినా వెలికి తీయవచ్చును.

- ఆచార్య ఎస్వీ రామారావు

Preview download free pdf of this Telugu book is available at Na Sahitya Vyasalu