• Na Bhasha Vyasalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా భాషా వ్యాసాలు

    Na Bhasha Vyasalu

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా. వెల్చాల కొండలరావు తెలుగు ఒడి భాషా ప్రేమికుడు. బడిభాష బోధనాభాషగా, పాలనాభాషగా సమగ్రంగా రూపొందాలనీ ఆలోచనాపరుడు. భాషలతత్వాన్ని అవగతం చేసుకున్న సామాజిక శాస్త్ర పరిశోధకుడు. ఈ వ్యాసాలను ఆయన ప్రచురించటం తెలుగు భాషాభిమానులందరు ఆహ్వానించదగిన విషయం.

తెలుగు భాషను భాషగానైనా కాపాడడానికి డా. వెల్చాల కొండలరావు పదకొండు సూచనలు చేసారు. ఒడి భాష, బడిభాష, ఏరకంగా వుంటే బాగుంటుందోనని సూచనలు చేశారు. ఈ పుస్తకంలోని 25 వ్యాసాల్లో ఒకటి రెండు వ్యాసాలు తప్ప మిగతావన్నీ తెలుగుభాష అమలు తీరుతెన్నులనూ, ఉనికినీ చర్చించినవే!

తెలుగు భాషాభివృద్ధికి ఈ వ్యాసాల్లో ఆలోచించదగ్గ కొన్ని ప్రతిపాదనలు కనిపిస్తాయి. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యమైనవి: అభివ్యక్తి కౌశలాలను పెంచే దిశగా తీసుకోవలసిన చర్యలు; సాంకేతిక వైజ్ఞానిక రంగాల్లోని జ్ఞానాన్ని తెలుగుకు అనువర్తించే దిశగా తగిన పరిభాషనూ కొత్తగా కల్పించుకోవడం. అనువాదాల ప్రాముఖ్యాన్ని మరింతగా గుర్తించడం, సుబోధకమైన శైలుల వాడకాన్ని ప్రోత్సహించడం. బోధనలో కొండలరావు మిశ్రమ విద్యా బోధన పద్ధతిని సూచించారు. తెలుగు ఇంగ్లీషు బోధనలో రెంటినీ సమంగా వాడుకునే పద్ధతి ఇది. ఈ మిశ్రమ బోధనా విధానం మరింత లోతుగా చర్చించవలసిన విషయం. ఒక కార్యాచరణ ప్రణాళికను సమర్థంగా రూపొందించవలసిన విషయం కూడా.

ఈ వ్యాసాలు అన్నీ చదివిన తర్వాత మన సభల్లో, మన ఉపన్యాసాల్లో, మన సదస్సుల్లో, మన ఘోషుల్లో తెలుగు అభివ్యక్తికి పెద్దపీట వేసే అవకాశాలు మరింతగా మెరుగుపతాయని ఆశించవచ్చు. ఈ మరింత మెరుగు పనికి మన విద్యా సంస్థల్లోని వసతులు, వనరులు, సౌకర్యాలు, నాణ్యమైన బోధనా విధానం సహకరిస్తే మరింత మంచింది. తెలుగు సాహిత్యాన్ని
పట్టించుకున్నంత గట్టిగా సృజనాత్మకేతర రంగాలలో వాడే (పాలన, బోధన, పరిశోధన, పత్రికలు, రేడియో, టెలివిజన్‌, సినిమా, ఇంటర్నెట్‌ వగైరా) తెలుగు భాషను కూడ పట్టించుకుంటే తెలుగు భాషావికాసానికి మంచిరోజులు వస్తాయి.

- ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Na Bhasha Vyasalu