-
-
నా భార్య కొడుకు
Na Bharya Koduku
Author: Suryadevara Rammohana Rao
Publisher: Model Publications
Pages: 233Language: Telugu
ముఖ్యమంత్రికి కొమ్ముకాస్తున్న మాదాల వెంకట్రామయ్య కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయడానికి అధికార పార్టీలోని అసమ్మతి వాదులకు అవకాశం చిక్కింది. వారు అవకాశాన్ని జారవిడుచుకోలేదు. ఎన్.జి.ఓ.లను రెచ్చగొట్టారు. ఎన్.జి.ఓలు సమ్మెకు దిగారు. పాలనా యంత్రాంగం స్తంబించింది. మునిసిపల్ ఉద్యోగుల సమ్మెవల్ల వీధులన్నీ మురికివాడలుగా మారిపోయాయి. హాస్పటల్స్‌లో రోగుల అజా గతీ పట్టించుకునే నర్స్‌లు లేరు.
ఈ సమస్య లన్నింటికీ మూలకారణం-రాజధాని పరిశ్రమలతో, పాలనా సంబంధమైన భవంతులతో, పౌరుల గృహాలతో క్రిక్కిరిసివుంటమే!
ఆ రాజధానికి ఒక వైపు సముద్రం- మరో వైపున కొండలు
ఈ సమస్య పరిష్కారానికి రెండే రెండు మార్గాలున్నాయి.
ఒకటి-సముద్రాన్ని పూడ్చడం... పర్వతాలను నేలమట్టం చేయడం.
రెండు-రాజధానిని అక్కడ్నించి మరో సువిశాల ప్రాంతానికి తరలించడం.
ఈ రెండిలో మొదటిది అసంభవం!
రెండవది వెంటనే జరిగే వ్యవహారం కాదు - పైపెచ్చు కొన్ని వేల కోట్లరూపాయల వ్యయంతో కూడుకున్నది.
రాజధానిని ఒకచోట నుంచి మరో చోటుకి తరలించడం వల్ల రాష్ట్ర ప్రగతి కుంటుబడటమేగాక, కొన్ని సంవత్సరాలపాటు పాలనా యంత్రాంగం స్తంభించిపోతుంది.
రోజు రోజుకీ పరిస్థితి క్షీణిస్తోంది.
రాజధానిలో ప్రారంభమయిన సమ్మెలు రాష్ట్రవ్యాప్తమయ్యాయి.
ధర్నాలు, నిరశన ప్రతాలు-ఎక్కడ చూసినా పెంటకుప్పలు, శవాలు!
రాష్ట్రంలోని పేపర్లేకాక దేశంలోని ఇతర పేపర్లు కూడ ముఖ్యమంత్రి అసమర్ధతని దుయ్యబడుతూ మెయిన్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.
Not upto the writer standard
ee novel asalu peru "Star Wars". Eeyana Wrasinade