-
-
నా భారతం అమర భారతం
Na Bharatam Amara Bharatam
Author: Swami Vivekananda
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 230Language: Telugu
భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యలు స్వామి వివేకానంద. 'భారతదేశంపై స్వామీజీకి ఎంతటి ప్రేమ! అందులో నూట ఒక్క భాగమైనా మీలో ఉందా?' అని ప్రశ్నిస్తారు స్వామి అఖండానంద. పాశ్చాత్య దేశాలలో హంసతూలికా తల్పాన్ని సైతం త్యజించి, కటిక నేలమీద పడుకొని 'అయ్యో! నా దేశప్రజలు ఆకలి బాధతో బాధపడుతున్నప్పుడు ఈ భోగాలన్నీ నాకెందుకు?' అని విలపించినవారు కదా ఆయన.
అందువల్లనే స్వామీజీ దేశభక్తిని స్వామి అఖండానంద ఇలా చెబుతున్నారు.
'స్వామీజీ భారతదేశం పట్ల కనబరచిన ప్రేమానురాగాలు సామాన్యమైనవి కాదు. అది దేశభక్తి కాదు. అది దేశాత్మబోధం. సామాన్య వ్యక్తులలో ఉండేది దేహాత్మబోధం. అంటే శరీరమే తానుగా భావించడం. మరి స్వామీజీలో ఉండినది దేశాత్మబోధం. అంటే దేశాన్నే తానుగా భావించం. దేశ ప్రజల సుఖ దుఃఖాలు, వారి వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల గురించే ఆయన ఆలోచించారు. దేశానికి ఒక నూతన భారతదేశం యొక్క దృశ్యాన్ని ప్రదర్శించిన వారిలో ముఖ్యలుగా భాసించేది స్వామి వివేకానంద. స్వతంత్రంగా, నూతనోత్సాహంతో, క్రొత్త మెరుగులతో, సనాతన ఔన్నత్యాన్ని మళ్ళీ రాణింపజేసిన భారతదేశం యొక్క దృశ్యాన్ని ఇలా వివరిస్తున్నారు.
'ఇంతవరకు కనీవినీ ఎరుగని ప్రత్యేకత గల భారతదేశం రూపుదిద్దుకొంటూన్నదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు..... అంతే! లేవండి! మేల్కొనండి! అమరమై, మహోన్నత స్థానంలో నూతన యువ ప్రాయంతో ఇంతవరకు లేని మహిమాన్వితంతో ఆమె విరాజిల్లుతుండడం చూడండి...?' ఇలాంటి ఒక అద్భుత దృశ్యంతో స్వామీజీ నిలబడిపోయారా? ఆ దృశ్యాన్ని యదార్థం చేయడనికి ఏమి చేయాలో, దాన్ని గురించి మనతో ముచ్చటించి మరీ వెళ్ళారాయన. దానిని గురించిన విషయమే ఈ 'నా భారతం - అమర భారతం'. వంగ భాషలో 1986లో ప్రచురింపబడి పలుసార్లు పునర్ముద్రింపబడిన 'ఆమార్ భారత్ - అమర్ భారత్' అనే గ్రంథం యొక్క తెలుగు అనువాదమే ఈ గ్రంథం. వంగ భాషలోని ఈ గ్రంథాన్ని సంకలనం చేసినవారు మన మఠ సన్న్యాసులలో ఒకరైన శ్రీ లోకేశ్వరానంద స్వామి. ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించది శ్రీ కాశీనాథుని శివరావు గారు.
భారతదేశాన్ని గురించిన స్వామి వివేకానందుల ఈ అద్భుతమైన సంకలన గ్రంథం చదువరులకు భారతదేశం గురించిన ఒక క్రొత్త దృక్పథాన్నిప్రదర్శిస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
- ప్రకాశకులు

- ₹540
- ₹108
- ₹81
- ₹60
- ₹269.1
- ₹72
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹108