-
-
ఎన్నారై కబుర్లు (ఒకటి)
NRI Kaburlu Okati
Author: Satyam Mandapati
Publisher: Sahitya Sourabham
Pages: 226Language: Telugu
ఎన్నారై కబుర్లు (ఒకటి)
నేను ఎప్పుడు వివిధ సంస్కృతుల గురించి తెలుసుకునే సెమినార్లకి వెళ్ళినా, నన్నో విషయం బాధిస్తూ వుండేది. చైనా జపాన్ కొరియాలాటి దేశాల్లో మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో నేర్పే సెమినార్లవి. సరదాగా వున్నా అక్కడికి వెళ్ళే నాలాటి వారికి ఎంతో ఉపయోగకరంగా వుండేవి. మనకి కావలసినవి అక్కడ సాధించుకురావటానికి ఎంతో దోహదం చేసేవి.
మరి ఇండియానించీ నెలనెలా కొన్ని వేలలో దిగుమతి అవుతున్న మన భారతీయులకి, ముఖ్యంగా తెలుగువాళ్ళకి, అమెరికాలో జీవితం సవ్యంగా గడపటానికి కావలసిన రకరకాల విషయాలపై సమాచారం ఇచ్చేవరు నాకు ఎక్కువగా కనపడలేదు. చదువుకోటానికి వచ్చేవాళ్ళూ, ఉద్యోగాలకి వచ్చేవాళ్ళు మొదట్లో నానా బాధలూ పడడం చూస్తున్నదే. ఇండియాలో స్నేహితుల ద్వారా చూసేవి పరిమితమైన అనుభవాలు మాత్రమే. అందుకని నా పాతికేళ్ళ అమెరికా అనుభవంలో, నేను చూసినవీ, నేర్చుకున్నవీ, మిత్రుల అనుభవాలూ, నాకు చేతనైన పద్ధతిలో వ్రాసి పాఠకులకు అందివ్వడం నా బాధ్యత అనిపించింది.
ఇది మిమ్మల్ని నవ్విస్తునే, కదిలిస్తూనే ఎంతో సమాచారం అందిస్తాయనే ఉద్దేశ్యంతో వ్రాసినవి. అవసరమైనదేదన్నా వుంటే వాడుకోండి, లేకపోతే చదివి హాయిగా నవ్వుకుని ఆనందించండి.
- సత్యం మందపాటి
