-
-
ఎన్ఆర్ పద్ధతి తెలుగు వాచకం (వారంలో తెలుగు)
N R Paddhati Telugu Vachakam Varamlo Telugu
Author: Nellore Narasimha Rao
Pages: 192Language: Telugu
తెలుగు చదవటం అంటే ముందుగా అక్షరాలు, ఆ తరువాత గుణింతాలు నేర్చుకోవాలి. అంటే 450 అక్షరాలకు పైగా నేర్చుకోవాలి. (అదే 56 అక్షరాలతో నేర్చుకోవాలంటే 600 అక్షరాలకు పైగా నేర్చుకోవాలి). ఈ ప్రక్రియలో తెలుగు నేర్చుకోవటానికి సంవత్సరాలు పడుతుంది (అందుకే మన విద్యార్థులలో చాలా మందికి పై తరగతులకు వచ్చినప్పటికీ కనీసం తెలుగు చదవటం రావటం లేదు). సంప్రదాయ పద్ధతిలో నేర్చుకోవటం మరీ కష్టం.
ఈ సమస్య పరిష్కారానికి అతి తక్కువ సమయంలో తెలుగు నేర్చుకునే పద్ధతిని రూపొందించటం జరిగింది. జన జీవితంలోని లయను ఉపయోగించి జనం మాట్లాడుకునే భాషలోనే వారికి చదువు నేర్పే పద్ధతిని రూపొందించటం జరిగింది.
ఈ పద్ధతిలో తెలుగు నేర్పితే అతి తక్కువ కాలంలో అభ్యాసకులు తమ మాతృ భాషను చదవగలుగుతారు. తక్కువ కాలంలో తెలుగు నేర్చుకోవటం ఒక సంబరం. తక్కువ సమయంలో తెలుగు నేర్పటం ఆనందమయం. తెలుగు చాలా తేలికగా వస్తుందనే ఆశ అభ్యాసకులలో చిగురిస్తుంది. తక్కువ కాలంలో చదువ నేర్పడం బోధకుడు భారంగా భావించడు. గమ్యం చేరేకొద్దీ ఉత్సాహం రెట్టింపవుతుంది. తక్కువ కాలంలో ఎక్కువ శ్రమ చేయటానికి అభ్యాసకుడు పూనుకుంటాడు. గమ్యం చేరేవరకు నిలుచుంటాడు. ఈ పద్ధతిననుసరించి తెలుగు నేర్చుకోవటానికి ఖర్చు తక్కువ. ఫలితమెక్కువ.
- సి. నారాయణ రెడ్డి
