-
-
మిస్టరీ
Mystery
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 210Language: Telugu
"కిరీటీ! చూస్తుంటే ఈ కేసు చాలా కాంప్లికేటెడ్‌గా మారుతోందనిపిస్తోంది. ఐ డోన్ట్ అండర్‌స్టాండ్. ఇందులో లాయర్ రుషి పాత్రను అనుమానించాల్సి వస్తోంది." అన్నాడు నుదురు రుద్దుకుంటూ గౌతమ్.
బిందు అంత్యక్రియలకు హాజరైన మరునాడు ఉదయమే కిరీటి, గౌతమ్‌లు బిందు ఎస్టేట్ నుంచి బయలుదేరి వచ్చేశారు. లాయరు రుషి సింధుని తీసుకుని సాయంత్రమే హైదరాబాద్ వెళ్ళిపోతానని చెప్పాడు. పదకొండో రోజు బిందు కర్మకాండ జరిపించాల్సి వుంది. భోజనాల కార్యక్రమం అంతా వుంటుంది. వారం రోజుల తర్వాత తిరిగి ఎస్టేట్‌కి వస్తారు వాళ్ళు.
కిరిటీ కారు కొత్తగూడెం వైపు పరుగుతీస్తోంది.
గౌతమ్ మాటలకు కిరీటి మౌనం వహించాడు.
"ఏమిటి మాట్లాడవు? రుషి ఎందుకిలా చేసినట్టు?" తిరిగి అడిగాడు గౌతమ్.
"ఇదే విషయాన్ని రుషిని అడిగాను, ఏదో చెప్పుకొచ్చాడు. కాని అతడి మాటల మీద నాకు విశ్వాసం లేదు. బిందు తిరిగి కుటుంబంలోకి వస్తే ఆస్తి మూడు వాటాలు చేయాలి. అది రుషికి ఇష్టం లేదు. ఎలాగూ ఫారెన్ వెళతానంటోంది గాబట్టి పంపించేస్తే వాటాల సమస్య వుండదని ప్లాన్ చేశాడు. కానీ అనూహ్యంగా ఆ రాత్రి సి.ఎం. వినాయకరావుతో బాటు ఆమె కూడా హంతకుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది" అన్నాడు కిరీటి.
"హంతకుడు రుషి ఎందుక్కాకూడదు?" సడెన్‌గా అడిగాడు గౌతమ్.
ఆ ప్రశ్న విని ఉలిక్కిపడ్డాడు కిరీటి.
Less than average