-
-
ముసుగు వీరుడు
Musugu Veerudu
Author: Adapa Chiranjeevi
Publisher: Sri Krishnadevaraya Publications
Pages: 49Language: Telugu
Description
మహారాజు నాగభూపతి తీర్పు విని పగలబడి నవ్వాడు విక్రముడు.
“ఎందుకలా నవ్వుతావు?" అంటూ అనుమానంగా చూశాడు నాగభూపతి.
“నీ తీర్పు అమలు జరగదు. ఎందుకంటే... నువ్వు, నీ పరివారం నన్ను బంధించలేరు. ఎందుకంటే... ఇష్టపూర్వకంగా నేను మీ భటులకు దొరికిపోయాను!" విక్రముడి మాటలకు చుట్టూ వున్న ప్రజలు చిత్రంగా చూశారు.
“తప్పించుకుపోవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నావా?" అని ప్రశ్నించాడు నాగభూపతి.
“ఎత్తులు ఇక అవసరం లేదు. చిత్తు చేయడం నాకు కొత్త కాదు!" అంటూ రెండు చేతులనూ బలంగా విదిలించాడు విక్రముడు. ఇరువైపులా గొలుసులు పట్టుకున్న భటులు దూరంగా ఎగిరిపడ్డారు. “అతణ్ణి బంధించండి..." అంటూ ఆజ్ఞాపించాడు నాగభూపతి.
పాఠకులను వాయు మనోవేగాలతో పరుగులు తీయించే
వికముడి సాహసయాత
ముసుగు వీరుడు
Preview download free pdf of this Telugu book is available at Musugu Veerudu
జానపద ప్రపంచాన్ని కళ్లకుకట్టిన నవల.రాజులు రాజ్యాలు కోటలు ఇలా ఆనాటి వాతావరణాన్ని కథలో కళ్ళముందు నిలిపాడు రచయిత.ముసుగుదొంగను మహావీరుడిగా పరిచయం చేసిన తీరు బావుంది.ఒక పాత్రను ముందే ఇతర పాత్రల ద్వారా పరిచయం చేసి కథానాయకుడిని అద్భుతంగా మలిచిన తీరు బావుంది.అడపా చిరంజీవి జానపద నవలల ప్రత్యేకత విభిన్నం.
Nice one.
అడపా చిరంజీవి గారు నిన్న నా ఫ్రెండ్ కనిపించి ' కినిగే ' లో మీ ముసుగు వీరుడు నవల చదివాను అని నాతో చెప్పి చాలా బావుంది అని అన్నాడు.మీరెవరో అతనికి తెలీదు తప్ప మీ నవలలు అన్నీ చదివాడు. అదే విషయాన్ని అతని చేత మీకు ఫోన్ చేయించి చెప్పిద్దామానుకుంటే మీ ఫోన్ కలవలేదు.
This is very small book. Just 49 small pages. Expected bigger story with more narration and twists.
జానపద సాహిత్యం అంతరించిపోతున్న నేటి హైటెక్ యుగంలో అడపా చిరంజీవిగారు 'ముసుగు వీరుడు' జానపద నవల రాయడం మెచ్చుకొదగ్గ విషయం. జానపద సాహిత్యంలో ఇతనికి పోటీ ఎవరు లేరు అనొచ్చు. ఎందుకంటే మరిచి పోయిన కాలనీ మళ్ళి గుర్తుకు తెచ్చి నేటి కాలానికి ముడివేసి పాఠకుడిని మంత్రముగ్దుడ్ని చేయడం అంత సులువు కాదు. వంట తెలిసిన వాడు గడ్డిపోచతో కూడా ఉలువ చారు చేసి తినిపించగలడు. 'ట్రంప్ కార్డు' లాంటి సంచలనాత్మక నవలను రాసి 'కలం తిరిగిన' (చేయి తిరిగిన కాదు) ఈ రచయిత అసాధ్యుడు.
- మోహనరావు దురికి (రచయిత, దర్శకుడు)
I like the folklores. It is a fantastic book to read. This novel hasn't disappointed me. The main plot of this novel is still relevant. I am expecting big novels from the author.
చిరంజీవి గారు!.. ఇందాకే మీ ముసుగు వీరుడు నవల చదివాను. మహారాజు అయిన నాగాభూపతి కూతురు స్వప్నమాల ,విక్రముడు ల ప్రేమ సంభాషణలు బావున్నాయి. చివర్లో స్వప్న మాల గురించి విక్రముడు చెప్పే నిజాలు తో చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇంకా మరికొన్ని విషయాలు గురిచి చెప్తే ఈ నవల చదివే వాళ్ళ థ్రిల్లింగ్ ని స్పాయిల్ చేసినట్టు అవుతుంది. ఎనే వే గతం లో వచ్చిన మీ జానపద నవలల మాదిరిగానే ఇదికూడా బావుంది. మీ నుండి మరో నవల కోసం నేనూ, నా ఫ్రెండ్స్ ఎదురుచూస్తున్నాం ..
అడపా చిరంజీవి గారు లాక్ డౌన్ టైం ని దుబారా చేయకుండా మంచి నవల రాసినట్టు వున్నారు. ఈ రోజే చదివి నా అభిప్రాయాన్ని ఫోన్ చేసి చెబుతాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబర్ చెబుతారా..
.బాహుబలి లాంటి ఫిల్మ్ బుల్ స్టొరీ రాయండి.అంటే సినిమా టిక్ గా వుండాలి.హీరోయిజం.. హీరోయిన్ పరిచయం... ఫైట్స్ స్కోప్ ..ఇంటర్ వెల్ పాయింట్.. ఇలాంటి వన్నీ దృష్టి లో పెట్టుకుని రాయండి. ఇలా సలహా ఇస్తున్నందుకు మరోలా అనుకోకండి. జానపద సినిమా కథల కొరత ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాలా వుంది. మీలాంటి గొప్ప రచయితల నుండి అలాంటి కథలు ఆశించడం లో తప్పులేదు కదా?
ఈ లాక్ డౌన్ లో ఈ నవల ఒక్కటే రాశారా ఇంకేమైనా రాశారా? .
ఇకపోతే తమిళ్ కమిడియన్ వడివేలు ప్రధాన పాత్ర లో "22 వ పులకేసి" అనే ఓ కామెడీ సినిమా వచ్చింది. మీ అభిమానిగా అలాంటి కథ మీ నుండి కోరుకుంటున్నాను. నా కోరిక నెరవేరుతుందా? వరా ముళ్ళపూడి గారు, నేనూ మీ నవలల గురించి నిన్ననే డిస్కస్ చేసుకున్నాము. అప్పుడే కామిడీ జానపద నవల ప్రస్తావన వచ్చింది.అందుకే ఇలా అంటున్నాను.
గాంధీ మనోహర్
ఫిల్మ్ డైరెక్టర్
అడపా చిరంజీవి గారు మంచి చెయ్యి తిరిగిన రచాయిత నేను ఆయన అభిమానిని.
నా చిన్నప్పుడు ఆయన వ్రాసిన 'గాలిబంగ్లా' నవల నాకు ఇప్పటి కి గుర్తు. జానపద నవల 'ముసుగు వీరుడు' అద్భుతంగా ఉంది.