-
-
మ్యూజికాలజిస్ట్ రాజా’ మల్లాది వెంకట కృష్ణమూర్తి
Musicologist Raja Malladi Venkata Krishnamurthy
Author: Dr. Raja (Musicologist)
Publisher: Self Published on Kinige
Pages: 285Language: Telugu
రచయిత మల్లాది హీరో గా యస్పీ బాలసుబ్రహ్మణ్యం, యస్పీ శైలజ, జంధ్యాల, ఆదివిష్ణు , జీడిగుంట రామచంద్ర మూర్తి వంటి లివింగ్ క్యారెక్టర్స్ తో మ్యూజికాలజిస్ట్ రాజా రాసిన లవ్ లీ, లైవ్ లీ నవల మల్లాది వెంకట కృష్ణ మూర్తి.
* * *
'మల్లాది వెంకటకృష్ణమూర్తి' అన్న పేరు మీద 'రాజా' వ్రాస్తున్న ఈ నవల సాహితీ రంగంలోనే కొత్త మలుపు! పూర్వం గాంధీ, నెహ్రూ, గవాస్కర్, అక్కినేని పేర్ల మీద పుస్తకాలు వచ్చాయి కాని, ఒక రచయిత, అందులోనూ తెలుగు రచయితల మీద ప్రథమంగా రావటం సంతోషదాయకం. పెద్ద పెద్ద దేశ నాయకుల, ఆయా రంగాల్లో ప్రముఖులయిన వ్యక్తులు-తాము ఆ స్థాయికి రావటానికి ఎంత కష్టపడ్డారో వివరించే పుస్తకాలు అవి! అలా కాకుండా అందరూ సరదాగా చదువుకోవటానికి వీలుగా కేవలం పేరుని మాత్రమే వాడుకుని, వ్యక్తిని సృష్టించి, కేరక్టర్ నడిపిన 'రాజా' అభినందనీయుడు.
- యండమూరి వీరేంద్రనాథ్
* * *
'రాజా' రాస్తున్న సీరియల్ 'మల్లాది వెంకటకృష్ణమూర్తి' కథని నాకు మొదటిసారి చెప్పినప్పుడు ఆయన 'మీ ఫోటో ఇంతదాకా ఎక్కడా రాకపోవడంవల్ల నేననుకున్న రచయిత పాత్రకి మీ పేరు వాడుకుంటాను. అభ్యంతరం లేదు కదా' అని అడిగారు. ఆ తర్వాత నాలుగైదుసార్లు ఈ కథ గురించి చర్చించాం. ఆయనలో మంచి స్పార్క్ ఉంది కాబట్టి ఆరువారాల కోసం అనుకున్న కథని దాదాపు పదిహేను వారాలదాకా ఎక్కడా విసుగు పుట్టకుండా పెంచి రాయగలిగారు. వ్యక్తిగతంగా నాకు సంబంధించిన కొన్ని విషయాలని కథలో సహజత్వం కోసం వాడుకోవడానికి చెప్పడం మినహా, ఇందులో నా ప్రమేయం ఏం లేదు. కొంతమంది వ్యక్తులు, ప్రసిద్ధులు, ఫోన్ చేసి అడిగారు. 'రాజా అనే మీ సీరియల్ చదువుతున్నాం. బాగుంది' అని. మరికొందరు 'రాజా' అనే పేరుతో నేనే ఆ నవల రాస్తున్నానని కూడా అభిప్రాయపడ్డారు. అందులో నిజం లేదు. పత్రికా సాహిత్యంలో సంబంధం లేని ఓ సుప్రసిద్ధ చిత్ర దర్శకుడే' ' ఆ సీరియల్ ఎవరు రాస్తున్నారని' అడగడాన్ని బట్టి చూస్తే ఈ నవల విశేషంగా అన్ని వర్గాల చేత ఆకర్షింపబడిందనిపించింది. రచయితగా కొన్నివేల పాత్రలు సృష్టించిన నన్నే తన తొలి నవల్లో ఓ పాత్రని చేయడంలో 'రాజా' విజయవంతం అయ్యారనే నా అభిప్రాయం. ఆయన రాసే తర్వాత సీరియల్ నవల కూడా ఇదే ఒరవడిలో సక్సెస్ అవాలని రాజాకి నా బెస్టు విషెస్ తెలియజేస్తున్నాను.
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
