• Muluguvari Mithunarasi Phalitalu 2016 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ములుగువారి మిథునరాశి ఫలితాలు 2016 (free)

    Muluguvari Mithunarasi Phalitalu 2016 - free

    Publisher: Mohan Publications

    Pages: 41
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మిథునరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ముఖ్యమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ప్రజలలో ప్రఖ్యాతి పెరుగుతుంది. ఆర్థికస్థితి బాగుంటుంది. ప్రతిష్టాత్మకమైన అవార్డులు లభిస్తాయి. కుటుంబ పురోగతి బాగుంటుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యలు పోతాయి. కోర్టుతీర్పులు అనుకూలంగా వచ్చినా ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా ఆచరణలోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగాల అభివృద్ధికి వ్యూహరచన ఫలిస్తుంది. దివారాత్రులు కష్టపడి పనిచేస్తారు. సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక సంబంధమైన విషయాలు, వైద్యవిద్యకు సంబంధించిన విషయాలు, సివిల్‌ సర్వీసులకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. జీవితాశయం సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. కుటుంబం పట్ల మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. పెద్దలను, వృద్దులను గౌరవిస్తారు. వాళ్ళ అవసరాలు దగ్గరుండి చూసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. మెరిట్ మార్కులు సాధిస్తారు. కుటుంబంలో మరొకరికి ఉద్యోగం వస్తుంది. పగలూ, ప్రతీకారాలకు దూరంగా ఉంటారు. వివాదాస్పదమైన అంశాలలో తలదూర్చరు. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తులకు మంచి ధర వస్తుంది. స్థిరాస్తులు వేటినీ అమ్మకూడదని కుటుంబపరంగా నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులు బాగా రాణిస్తారు.

- ప్రచురణకర్తలు