-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ములుగువారి మీనరాశి ఫలితాలు 2016 (free)
Muluguvari Meenarasi Phalitalu 2016 - free
Publisher: Mohan Publications
Pages: 40Language: Telugu
మీన రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఋణాలు తీర్చివేస్తారు. నూతన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్థులపరంగా కలసి వస్తుంది. విద్యా, ఉద్యోగ సంబంధమైన విషయాలు బాగుంటాయి. సంవత్సర ప్రథమార్థంకన్నా, ద్వితీయార్థం బాగుంటుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన ఉత్తర్వులు కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. రాజకీయంగా అనుకూలంగా ఉంది. సామాజిక సేవాకార్యక్రమాలలో మంచి పేరు వస్తుంది. మీమీద ఆధారపడిన అనేకమందిని ఆదుకుంటారు. న్యాయం చేస్తారు. అనుకూలమైన బుధగ్రహప్రభావాల వల్ల ఏ పని చేపట్టినా తిరుగులేకుండా ఉంటుంది, ప్రజాకర్షణ ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మీరే కీలకమైన వ్యక్తి అవుతారు. మీ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వ పరంగా మంచి ఆర్డర్లు తీసుకు వస్తారు, మంచి లాభాలు పొందగలుగుతారు. సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. స్త్రీలవల్ల కొన్ని ఉపయోగాలు ఏర్పడతాయి. చాలామంది మీ పట్ల నమ్మకం కలిగి వాళ్ళ సమస్యలను చెప్పుకుంటారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించి స్త్రీల దగ్గర ఓ నమ్మకాన్ని ఏర్పరచుకోగలుగుతారు. సంవత్సర ద్వితీయార్థంలో రెండు నెలలు వృత్తి, ఉద్యోగాల పరంగా సంతృప్తి ఉండదు. సాంకేతిక పరమైన విద్యారంగంలో రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను (ఐ.ఐ.టి వంటివి) అభ్యసించడానికి అవకాశాలు కలసివస్తాయి. సంతాన పరమైన విషయాలు సజావుగా ఉన్నప్పటికీ, జ్యేష్టకుమార్తె, లేక జ్యేష్ట కుమారుని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తి కరంగానే ఉంటాయి. భాగస్వాముల అసమర్థతవల్ల అధికారులతో చిక్కులు వస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం తప్పక పోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడు కోగలుగుతారు. కుటుంబంలో, బంధువులలో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. జరగవు అనుకున్న శుభకార్యాలు ఆకస్మికంగా ముడిపడతాయి, పెళ్ళి ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు. దురభ్యాసాలు కలిగి, క్రమశిక్షణలేని మీ సన్నిహితుల వల్ల ఇబ్బంది పడతారు. ఇసుక నుండి తైలం తీయవచ్చు. ఇష్టంలేని వ్యక్తుల నుండి ప్రేమాభిమానాలు సాధించటం వల్ల కాదని గ్రహిస్తారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొంత కాలం రక్తసంబంధీకులతో విభేదాలు చోటుచేసుకుంటాయి. కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు. మనోనిగ్రహంతో కఠినమై క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని ఓ గాడిలో పెడతారు.
- ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE