• Muluguvari Makararasi Phalitalu 2016 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ములుగువారి మకరరాశి ఫలితాలు 2016 (free)

    Muluguvari Makararasi Phalitalu 2016 - free

    Publisher: Mohan Publications

    Pages: 40
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మకరరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా అభివృద్ధి, స్థిరత్వం కలుగుతుంది. సంవత్సర ప్రథమార్థంలో ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన రెండు కార్యక్రమాలు శని గ్రహ అనుకూలత వల్ల పూర్తి అవుతాయి. అడ్డంకిగా మారినటువంటి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు వస్తాయి. స్వయంకృతాపరాధాల వల్ల నష్టాన్ని పూరించుకోవడానికి కఠినమైన క్రమశిక్షణతో మిమ్ములను మీరు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. కొత్త మిత్రులు దూరం అవుతారు, పాతమిత్రులు దగ్గరవుతారు. రాజకీయ పరమైన విషయాలలో మీ జోక్యం అనివార్యం అవుతుంది. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ మీ రాజకీయ ప్రవేశం ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తితో కలిసి పనిచేయాలనుకునే మీ ఆరాటం ఫలిస్తుంది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారికి మీ సలహాలు, సంప్రదింపులు అవసరం అవుతాయి. మొండికిపిన ఓ అధికారి ఎంత మంది ముఖ్యులు చెప్పినా, మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోవడం జరుగుతుంది. మీ పాలిట సైంధవుడిలా అడ్డుపడుతున్న ఆ అధికారికి స్థానచలనం సంభవిస్తుంది, దాంతో మీ సమస్య తీరుతుంది. మీరు కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశం దొరుకుతుంది. సాఫ్ట్‌ వేర్‌ రంగంలోని వారికి శక్తి సామర్ధ్యాలకు తగినటువంటి మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలలో చదువుకోవాలనే మీ ఆరాటం ఈ సంవత్సరం ఫలిస్తుంది. అంతేగాక విదేశాలలో ఉద్యోగం చేయానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారికి అటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా చిన్నచిన్న చిక్కులు ఏర్పడతాయి. కుడి మోకాలికి సంబంధించి ఎలాంటి నొప్పులు రాకుండా జాగ్రత్త పడండి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. మిమ్ములను నిత్యం పొగిడే భజన బృందాలకు దూరంగా ఉండండి. మోసగాళ్ళ మాటలు విని ఆత్మీయులను దూరం చేసుకుంటారు. మీ కార్యక్రమాలన్నీ క్రమశిక్షణాయుతంగా, రహస్యంగా ముందుకు సాగుతాయి. సహోదర సహోదరీ వర్గానికి మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆర్థిక సాయం అందిస్తారు. విలువైన భూమిని కొనుగోలు చేస్తారు, కమర్షియల్‌ ఏరియాలో ఒక అపార్ట్‌మెంటు కొనుగోలు చేస్తారు. మీ కొనుగోళ్ళు అన్నీ గోప్యంగా ఉంటాయి. ఉద్యోగంలో బదిలీ వేటు తప్పక పోవచ్చు, అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీ బదిలీ ఆగిపోతుంది. విద్యాపరంగా అభివృద్ధి బాగుంటుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఓముఖ్యమైన వ్యక్తికి మీరు అంతరంగికులు కావడం వల్ల ఆ వ్యక్తి చేసే తప్పుడు పనికి మీరే కారణం అని వైరివర్గం భావిస్తారు.

- ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి.