-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ములుగువారి కుంభరాశి ఫలితాలు 2016 (free)
Muluguvari Kumbharasi Phalitalu 2016 - free
Publisher: Mohan Publications
Pages: 40Language: Telugu
కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. సంవత్సర ప్రథమార్థం, ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. ముఖ్యమైన బరువు బాధ్యతలను దించుకోగలుగుతారు. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. నిర్మాణ సంబంధమైన వ్యవహారాల పనులు పూర్తి అవుతాయి. సమాజంలో గుడ్ విల్ పెరుగుతుంది. కుటుంబం కొరకు అధికంగా ధనం ఖర్చువుతుంది. ఏదొక ఖర్చు తగ్గించుకోవాలని మీరు ప్రయత్నించినా సఫలీకృతం కాలేరు. విచిత్రమైన విషయం ఏమిటంటే అవసరం వచ్చినప్పుడు డబ్బు ఏదోకరూపంలో వస్తుంది. అవసరం లేనప్పుడు డబ్బు ఏవిధంగానూ రాదు. కొన్ని పెళ్ళి సంబంధాలు దగ్గరవరకూ వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. అనేక రకాలైన ఒడిదుడుకులు ఏర్పడతాయి. జ్యోతిష్కుల అభిప్రాయాల వల్ల కూడా కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చి తప్పిపోతాయి. ఆటుపోటుకు ఏర్పడినా చివరకు మంచి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మికరంగంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. దొంగస్వామీజీలను నమ్మి మోసపోతారు. వ్యాపార విషయంలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. సన్నిహితుల సలహాలు తీసుకోనందుకు మిమ్ములను మీరే నిందించుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్లక్ష్యం పనికిరాదు. కాంట్రాక్టులు, లీజులు, లైసెన్సులు, సబ్ కాంట్రాక్టులు మొదలైనవి లభిస్తాయి. వ్యాపార విస్తరణకు ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా వ్యాపారం వృద్ధి చెందుతుంది. సంతాన పురోగతి, కుటుంబ పురోగతి బాగుంటుంది. సామాజికంగా, రాజకీయంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సంతాన విషయమై ఎక్కువ శ్రద్ద కనబరుస్తారు. వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి మీ శాయశక్తులా ప్రయత్నిస్తారు. సంతానం కోసం అధికంగా డబ్బు ఖర్చు చేయవలసిన పరిస్థితులు. ఇది వృధా ఖర్చులు కావు, సంతానానికి బంగారు బాట అవుతాయి. వారసత్వంగా రావాల్సిన చరస్థిరాస్తులు మీకు దక్కుతాయి. కొన్ని సందర్భాలలో ఇంట్లో అప్రశాంత వాతావరణం, చిల్లర తగాదాలు ఏర్పడతాయి. మీ తగాదాల ప్రభావం పిల్లల మీద పడే అవకాశం ఉంది, అందువల్ల, కష్టమైనా, నిష్టూరమైనా కోపానికి ఎక్కడ తావు ఇవ్వవద్దు. దూరప్రాంతాలలో ఉన్న మీ సన్నిహితవర్గానికి, రక్తసంబంధీకులకు మేలు చేస్తారు.
- ములుగు రామలింగేశ్వరవరప్రసాద్ సిద్ధాంతి.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE