-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ములుగువారి కన్యరాశి ఫలితాలు 2016 (free)
Muluguvari Kanyarasi Phalitalu 2016 - free
Publisher: Mohan Publications
Pages: 40Language: Telugu
కన్యారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అందులో ఎక్కువగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రతి పని ఎంతో కష్టంతో పూర్తవుతుంది. ముఖ్యమైన పనులు దైవానుగ్రహం వలన పూర్తవుతాయి. నిష్కారణమైన విభేదాలు, సామర్థ్యానికి తగిన గుర్తింపు లభించక పోవడం జరుగుతుంది. మీ కన్నా స్థాయి తక్కువవాళ్ళ, సామర్థ్యం లేనివాళ్ళు, మీ కంటే ఉన్నత స్థానంలో ఉంటారు. ఇటువంటి సంఘటనలు మానసిక వేదనకు దారి తీస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధించ గలుగుతారు. ఇంటర్య్వూలలో కూడా మీ సామర్ధ్యాన్ని నిరూపించుకుంటారు. ఉద్యోగం వస్తుంది. కాని సంతృప్తి ఉండదు. కోర్టు పరంగా రావాల్సిన తీర్పుల కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్థిరాస్థులకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువ ఇబ్బంది పెడతాయి. విద్యా సంబంధమైన విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి ఉన్నత విద్యలు అభ్యసించగలుగుతారు. టీచర్స్ వల్ల, ప్రొపెసర్స్ వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కుల, మత, వర్గ ప్రాంతీయ విద్వేషాలు మీ మీద ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రభావం చూపుతాయి. మిమ్ములను మీరు నిరూపించుకోవడనికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. లిఖిత పూర్వకంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులకు వక్రభాష్యం చెప్పి మీ ప్రయోజనాలను కొంత మంది అధికారులు అడ్డుకుంటారు. న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. వారసత్వంగా రావాల్సిన ఆస్థుల విషయంలో మీకు అన్యాయం జరుగుతుంది. కొంత మంది విషయంలో కొత్త ఆలోచనలు వేధిస్తాయి. ఎన్నాళ్ళీ జీవన గమనం అని ప్రశ్నించుకుంటారు. నైరాశ్యం, వైరాగ్యం ఎక్కువ అవుతాయి. ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్‌కు లోనుకావద్దు.
- ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE