• Muluguvari Dhanoorasi Phalitalu 2016 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ములుగువారి ధనూరాశి ఫలితాలు 2016 (free)

    Muluguvari Dhanoorasi Phalitalu 2016 - free

    Publisher: Mohan Publications

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ రాశివారికి ఈ సంవత్సరం బాగుంది. సంవత్సర ప్రథమార్థంకన్నా ద్వితీయార్థం బాగుంది. అనుకున్న పనులు మూడొంతులు పూర్తి అవుతాయి. ఆర్థికపరమైన సర్థుబాట్లు ఎక్కువ అవుతాయి. డబ్బులు వస్తాయి, చేతిలో నిలబడవు, సమస్యలు వస్తాయి, సమసిపోతాయి. ప్రతి విషయం కొండంత కష్టంగా అనిపిస్తుంది, మబ్బులంత తొందరగా విడిపోతుంది, మనోస్థైర్యం చాలా అవసరం. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత స్థితి సాధించాలని మంత్రోపదేశం తీసుకుంటారు. క్రమబద్ధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. చిన్న విషయాలకు కూడ అతిగా ప్రతిపాదిస్తారు. మీ సలహాలను పెడచెవిన పెట్టి దురాశకు పోయి నష్టపోయిన మీ సన్నిహితులను మందలించి తగిన సహాయం కూడా అందిస్తారు. జీవితంలో అశాంతిని సృష్టిస్తున్న ఓ స్త్రీని వదిలించుకోవడానికి న్యాయపోరాటం చేసి విజయం సాధిస్తారు. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగానికి సరైన కారణం లేకుండ కొంతకాలం శెలవు పెడతారు. స్త్రీ పురుషుల అనుబంధానికి, స్నేహానికి ఎవరైతే వక్రభాష్యాలు చెవుతున్నారో వీుతో ఏకీభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అభిమానించిన స్త్రీ కనుమరుగు అవుతుంది (కొంత మంది విషయంలో) ఈ విషయాన్నిమౌనంగా భరిస్తారు. కొంత మంది విషయంలో వన్‌ సైడ్ లవ్‌ ఫలించదు. మీ ఊహలకు, అపోహలకు, భయాలకు ఇతరులను నిష్కారణంగా బలిచేస్తారు. ఇతరుల విధానాలకు మీరు అతిగా ప్రభావితులు అవుతారు. కొంతలో కొంత ఇది మేలు చేస్తుంది. వాస్తవాలను స్పష్టంగా గ్రహిస్తారు. ఊహాలోకాలలో విహరించే పరిస్థితికి స్వస్తి చెబుతారు. దొంగస్వామీజీల వల్ల నష్టపోతారు. ఇతరుల నుండి సలహాలు తీసుకునే పద్దతికి స్వస్తి చెబుతారు, మంచి చెడూ మీరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

- ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి.