• Muluguvaari Vrischikarasi Phalitalu 2016 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ములుగువారి వృశ్చికరాశి ఫలితాలు 2016 (free)

    Muluguvaari Vrischikarasi Phalitalu 2016 - free

    Publisher: Mohan Publications

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ ప్రధానమైన విషయాలు ముడిపతాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యక్తిగత స్థాయిని పెంచుకోగలుగుతారు. కఠినమైన సవాళ్ళను, సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవలిసి వస్తుంది. అందరూ తోడుగా ఉన్నా ఒంటరిగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఆర్థిక, విద్యాపరమైన అంశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌ వస్తుంది. మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే ఆశించిన జీతం రాదు. కుటుంబ పరమైన విషయాలలో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి, కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి. విదేశీయాన సంబంధ విషయాలు, విదేశాలలో
చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, విదేశాలలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సంవత్సర ద్వియతీయార్థంలో ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి బ్యాంకు ఋణాలు చేస్తారు, రాజకీయ పలుకుబడి ఉపయోగపడుతుంది, రాజకీయాలలో రాణిస్తారు. కఠినమైన లక్ష్యసాధనకు విశేషమైన కృషి చేస్తారు. అనువంశిక ఆస్థులు కలిసివస్తాయి. దీర్ఘకాలిక ప్రాణమిత్రులతో విభేదాలు వస్తాయి. మీ సహోదర సహోదరీ వర్గం మీకు వ్యతిరేకంగా మీ తల్లిదంఢ్రుల వద్ద, పెద్దల వద్ద వ్యతిరేక ప్రచారం చేస్తారు. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్‌ కార్డు లభిస్తుంది. కోర్టు జోక్యం వల్ల ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది. డబ్బులకు అమ్ముడుపోయే అధికారుల వద్ద పనిచేయడం
మానుకుంటారు. కొంత మంది విషయంలో వాలెంటరీ రిటైర్మెంట్ వాయిదా పడుతుంది. కుటుంబఖర్చులు అధికం అవుతాయి. అసమర్థులైన అంతరంగిక స్నేహితవర్గాన్ని దూరంగా ఉంచుతారు. మీరు ఒక కీలక భాధ్యతలు నిర్వహిస్తున్న పదవిలో ఉన్నప్పుడు మీపై తప్పుడు ప్రచారాలు, అపనిందలు చోటుచేసుకుంటాయి.

- ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి.